పాలియేటివ్ కేర్
జీవిత చరమాంకంలో ఉండే వయో వృద్ధులు, కేన్సర్‌కు గురై చివరి దశలో ఉన్నవాళ్లు తుదిశ్వాస వరకూ నొప్పి, బాధ తెలియకుండా సంతోషంగా గడిపేందుకు అవసరమైన సపర్యలు చేయడాన్నే వైద్య పరిభాషలో ‘పాలియేటివ్ కేర్’గా పిలుస్తారు.
అన్ని జిల్లాల్లో గ్రామా స్థాయిలో పాలియేటివ్ కేర్ ప్రారంభించా లని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది. దీనికి అవసరమైన నిధులను సమకూర్చాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కోరింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోఆషా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఎన్‌హెచ్‌ఎం కింద దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మంచాన పడ్డవారికి వారి
ఆషా కార్యకర్త ద్వారా ఇంటికే వెళ్లి సేవలందించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
అన్ని జిల్లాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యాస్మిన్ గారు తెలిపారు.
పాశ్చాత్య దేశాల్లో ఇది ఎప్పటి నుంచో అమలవుతోంది. ఖర్చుతో కూడుకున్న వ్యవహా రం కావడంతో ఈ సేవలను పొందడం అందరికీ సాధ్యం కాదు. దీంతో చాలామంది అంతిమ దశలో బాధను అనుభవిస్తూ తనువు చాలిస్తారు. ఇలాంటి వారికి కావాల్సిన వైద్య సేవలు, మందులు ఇవ్వగలిగితే వారి జీవిత కాలాన్ని పొడిగించడంతోపాటు, నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించొచ్చు.
జిల్లాకు ఒక ప్రత్యేక వైద్య బృందం..
పాలియేటివ్ కేర్ కింద ప్రత్యేక వైద్య బృందం రోజూ కనీసం 12 మంది రోగుల ఇంటికి వెళ్లి సేవలు చేయాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తూ NCD-CD వివరాలను నమోదు చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? అని ఆశ వర్కర్లు సర్వ్ నిర్వహించి అలాంటి వారి వివరాలు తీసుకుని ఏఎన్‌ఎంలకు సమాచారమిస్తారు.
ఆరోగ్యశాఖ సిబ్బంది రోగి ఇంటికి వెళ్లి ‘పాలియేటివ్ కేర్’ అవసరమా లేదా? అవసరమైతే ఎలాంటి సేవలు అవసరమన్న సమాచారం సేకరించి మెడికల్ ఆఫీసర్‌కు నివేదిస్తారు. డాక్టర్ వెళ్లి ఆ రోగికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడంతో పాటు సదరు రోగికి ఎలా వైద్యం చేయాలన్న దానిపై కుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తారు. అవసరాన్ని బట్టి వారానికి ఒకట్రెండు సార్లు లేదా రెండ్రోజులకోసారి రోగి ఇంటికి వైద్య బృందం వెళ్లి సేవలు చేస్తుంది. రోగి మానసిక ఉల్లాసానికి అవసరమైన కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తారు. ఇంట్లో సేవలు అందించలేని పరిస్థితి ఉంటే సమీప ప్రభుత్వ ఆసుపత్రులలో ‘పాలియేటివ్ కేర్’ వార్డుల్లో ఉంచి సపర్యలు చేస్తారు.
ఆషా కార్యకర్త సర్వ్ నిర్వహించవల్సిన విధానం
ఆశ వర్కర్లుకు 16.02.2022 నుంచి 18.02.2022 వరకు (3 రోజులు) శిక్షణ కార్యక్రమము 21.02.2022 నుంచి 26.02.2022 వరకు గృహ సందర్శన ద్వారా సర్వ్ నిర్వహించి వారి వివరాలు తీసుకుని ఏఎన్‌ఎంలకు సమాచారమిస్తారు. సేవలు అవసరమన్న సమాచారం మెడికల్ ఆఫీసర్ 02.03.2022 న జిల్లా నివేదిస్తారు
Comments
Post a Comment