వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీల కాలమ్ పొడిగింపు
వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీల కాలమ్ 25.02.2022 నుంచి 30.03.2022 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
బదిలీల ప్రక్రియలో ఫెసిలిటీ మాస్టర్ చేయడానికి, ఖాళీల వివరాలు మరియు 5 సంవత్సరాల సర్వీస్ వివరాలు పోర్టల్ నందు నమోదుకు కొంత సమయం ఎక్కువ తీసుకోవడం వలన బదిలీల కాలమ్ 25.02.2022 నుంచి 30.03.2022 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
- ఉద్యోగులు వారి యొక్క ఆప్షన్స్ నమోదుకు 25.02.2022 నుంచి 03.03.2022 వరకు ఇవ్వడం జరిగింది.
- సంబంధిత శాఖ అధికారులు 04.03.2022 నుంచి 08.03.2022 వరకు బదిలీ ల ప్రక్రియను వర్చ్యువల్ పద్దతిలో నిర్వహించి ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుంది.
- బదిలీ అయిన ఉద్యోగి 20.03.2022 లోపు ట్రాన్స్ఫర్ అయిన ప్లేసులో జాయిన్ అవ్వవలసి ఉన్నది.
- అర్హత ఉన్న అందరి రిక్వెస్ట్ అప్లికేషన్ పరిగణలో తీసుకొని బదిలీలు చేయవలసి ఉంటుంది.
- ప్రతి క్యాడర్ లో కూడా బదిలీలకు సాంక్షన్డ్ పోస్టులలో 30% సీలింగ్ పెట్టడం జరిగింది.
- ఎక్కువ సర్వీస్ నుంచి తక్కువ సర్వీస్ వరకు డిసెండింగ్ ప్రకారం బదిలీలకు పరిగణించాలి .
- 30% పరిగణించటం లో 0.50 ని 0 గా 0.51 ని 1 గా పరిగణించాలి అంటే ఉదాహరణకు 21 సాంక్షన్డ్ పోస్టులలో 30% అనగా 6.3 ని " 6 " పోస్టులకు పరిమిత 22 సాంక్షన్డ్ పోస్టులలో 30% అనగా 6.6 ని " 7 " గా పరిగణించాలి.
- 16 అంతకంటే తక్కువ సాంక్షన్డ్ పోస్టులు ఉన్నవాటికి 30% వర్తించదు.
- 31.03.2022 నుంచి మరల బదిలీల పైన నిషేధం పరిగణించబడును.
- APVVP వారికీ వేరుగా విధివిధానాలు ఇవ్వబడును.
- పైన తెలిపిన మార్పులతో పటు గా పాత ఆర్డర్ ప్రకారం మిగిలిన విధివిధానాలు అన్ని యధావిధిగా అమలు పరచవలెను.
- పైన తెలిపిన విషయాలకు అనుగుణంగా హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తగు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.
Comments
Post a Comment