కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపు పై ప్రభుత్వం పునరాలోచన చేస్తుంది.

 కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపు పై ప్రభుత్వం పునరాలోచన చేస్తుంది.

👉. ప్రభుత్వ అడ్వైజర్ సజ్జల హామీ. 

👉. రెండు మూడు రోజుల్లో ఉద్యోగులకు తీపి కబురు.

👉. ఆర్థికేతర సమస్యలపై సత్వర పరిష్కారం.

  • రాష్ట్రంలోని కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని అతి త్వరలో న్యాయం చేస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 
  • 07.02.2022 సోమవారం సాయంత్రం  తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ  ప్రధాన కార్యాలయంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జేఏసి ప్రతినిధులతో సమస్యలపై చర్చించారు. అన్ని సమస్యలపై సావధానంగా విన్న ఆయన ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉద్యోగులకు పి ఆర్ సి లో పెంచిన వేతనం ఏమాత్రం సరిపోదని తెలుపుతూ అతి త్వరలో ముఖ్యమంత్రితో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు. 
  • అలాగే ఆర్థికేతర సమస్యలపై చర్చించి విడివిడిగా వినతి పత్రాలు ఇవ్వాలని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు విషయంలో ఆ పేరు ప్రతిష్టలు ప్రభుత్వానికి దక్కేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 
  • ప్రభుత్వం కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చేతనైన సహాయం చేస్తుంది తప్ప ఉద్యమం చేసే నేతలు వారి అవసరాలకు వాడు వాడుకొని వారి సంఖ్యా బలం పెంచుకుంటున్నారని తెలుపుతూ అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడాలి అన్నారు. 
  • అలాగే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్సింగ్ సర్వీస్ నందు కలవకుండా ఆర్టీసీ, అటవి, పంచాయతీరాజ్, ఇంకా  కొన్ని డిపార్ట్మెంట్ లకు సంబంధించిన తదితర శాఖలో  ఔట్సోర్సింగ్ విధానం లో పనిచేస్తూ ఇప్పటికీ ప్రవేటు ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉన్న వారిని అందరిని కార్పొరేషన్లో విలీనం చేస్తామన్నారు. 
  • ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఔట్సోర్సింగ్ వారికి కూడ MTS (Minimum Time Scale) ను కోరగా అది ప్రభుత్వ విధానంలో ముడిపడి ఉన్నందున అమలు పరిచేందుకు సమయం పడుతుందని తెలిపారు. 
  • అనంతరం జేఏసీ ప్రతినిధులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 

                             

Comments