నికోటిన్ ట్రాన్సడెర్మల్ ప్యాచెస్
ప్రభుత్వం ఉచితంగా పొగాకు తాగి మరియు తినే దురలవాటును మాన్పించే కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లానందు నికోటిన్ ట్రాన్సడెర్మల్ ప్యాచెస్ ద్వారా చికిత్సా అందించి వారిని పూర్తిస్థాయిలో పొగాకు తాగి మరియు తినే దురలవాటును మాన్పించే కార్యక్రమాన్ని విర్వహించడం జరుగుతుంది.
- ఇవి పొగాకు తాగి మరియు తినే దురలవాటును మాన్పించే పట్టిలు.
- ఇవి ఇప్పుడు మన ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో గల మానసిక విభాగమునందు కల పొగాకు మాన్పించు కేంద్రములో లభ్యమగును.
- గౌరవనీయులైన వైద్యాధికారులు తమ ప్రాధమిక ఆరోగ్య కేంద్రమునకు విచ్చేసే రోగులను పొగాకు వినియోగం గూర్చి అడిగి, అలవాటు ఉన్న రోగులను మన ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో లో కల పొగాకు మాన్పించు కేంద్రానికి పంపించే విధముగా ప్రోత్సహించగలరు.
ప్రతి ఆరోగ్యకార్యకర్త తమపరిధిలో ఎవరైనా పొగాకు తాగి మరియు తినే దురలవాటును మనుకోవటానికి వారిని కౌన్సిలింగ్ చేసి వారిని జిల్లాకేంద్రం లోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో గల మానసిక విభాగము నందు కల పొగాకు మాన్పించు కేంద్రముకు పంపించి చికిత్స అందించవచ్చు.
లేదంటే ఆరోగ్యకార్యకర్త చికిత్స తీసుకోవటానికి సిద్ధంగా ఉన్న వారి వివరములతో సంప్రదిస్తే వారికే నికోటిన్ ట్రాన్సడెర్మల్ ప్యాచెస్ఇచ్చి ఎలా వాడవలెనో తెలియచేస్తారు. వారు గ్రామంలోనే ఆషా కార్యకర్త ద్వారా వారి ఇంటివద్దనే వినియోగించి పొగాకు తాగి మరియు తినే దురలవాటును మాన్పించే విధంగా చేయవచ్చు.
మరిన్ని వివరములకొరకు
డాక్టర్. రామ్ ప్రసాద్ సైకాలజిస్ట్,
డిపార్ట్మెంట్ అఫ్ సైకియాట్రీ,
రూమ్ నెంబర్ 21, ఔట్-పేషెంట్ విభాగము,
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గుంటూరు.
ఫోన్ నెంబర్ 8886343435.
Comments
Post a Comment