క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం
క్షయ వ్యాధి అంటే : “మైక్రోబ్యాక్టీరియ౦ట్యూబర్క్యూలై” అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి
వ్యాధి వ్యాప్తి చెందే విధానం : క్షయ రోగి దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా
(Droplet Infection)
వ్యాధి లక్షణాలు : 1. రెండు వారాలు పైబడి దగ్గు, కఫం లేదా కళ్ళే పడుట,
కఫంలో రక్తం పడుట
2. సాయంకాల వేళ వచ్చే జ్వరం, ఛాతిలో నొప్పి
3. ఆకలి తగ్గుట మరియు
4. బరువు తగ్గుట
వ్యాధి నిర్ధారణ : అన్నీ మైక్రోస్కోపిక్ సెంటర్సో నిర్వహించే కఫలం లేదా
కళ్ళే పరీక్ష ద్వారా, ఇంకా X-ray, “FNAC” RTPCR మరియు “CBNAAT” పద్దతుల ద్వారా
క్షయలోని రకాలు : క్షయ ముఖ్యంగా రెండు రకాలు:
1. ఊపిరితిత్తులకు సంక్రమి౦చ్చే పల్మనరీ TB. 2. శరీరంలోని ఇతర భాగాలకు సోకే ఎక్స్ ట్రా పల్మనరీTB
- అయితే కఫంలో ‘బాసిలై’ ఉన్నట్లు పరీక్షలో తేలితే, ఆ క్షయ మాత్రమే ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే ప్రమాదము ఉంది.
క్షయ తీవ్రత : ప్రపంచంలోని మొత్తం కేసులలో 5వ వంతు మన భారత దేశంలో ఉన్నాయి.
- రోజు 5 వేల మందికి, సంవత్సరంలో 18 లక్షల మందికి వ్యాధి సంక్రమణం జరుగుతుంది.
- సగటున రోజుకి 1500 మంది క్షయ కారణముగా మరణిస్తున్నారు. కావున 2025 నాటికి మన దేశంలో క్షయను అంతం చేయాలని లక్ష్య౦.
- దీనిలో భాగంగానే కొత్త కొత్త పరీక్ష విధానాలను తీసుకొని రావటం జరిగింది.
క్షయను సమర్ధవంతముగా నియంత్రించే ఔషధాలు
ఔషధాలు : ఐసోనియాజిడ్, రీఫంప్సిన్, పైరజినమైడ్ మరియు ఇధాంబూటల్ మొదలగునవి.
నూతనంగా “బిడాక్విలిన్” అనే ఔషధ౦
చికిత్స కాలం : క్రొత్తగా గుర్తించిన ఔషధ నిరోధకత లేని రోగులకు “6” నెలలు. రెసిస్టెన్స్ గల రోగులకు (MDR.TB) 6-18 నెలలు. సరియైన పద్దతిలో క్షయ రోగులు చికిత్స పొందినచో ‘పూర్తి స్వస్థత’ పొందవచ్చు.
క్షయ రోగులు : వైద్యులు సూచించిన ప్రకారం ట్రీట్ మెంట్ సపోర్టర్స్ పర్యవేక్షణలో పూర్తి చికిత్స క్రమ పద్దతిలో తీసుకోవాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు : చికిత్స కాలంలో నిర్వహించే పరీక్షలకు సహకరించాలి. (ఫాలో అప్స్) గ్రుడ్లు, పాలు, ఆకుకూరలు మరియు పప్పు దినుసులు, పండ్లు వంటి పోషకాహార౦ తీసుకోవాలి.
ముందుస్తు జాగ్రత్త : సంవత్సరం లోపు పిల్లలందరికి వారికి భవిష్యత్ లో క్షయ రాకుండా ‘BCG’ టీకా వేయించుట ద్వారా, అలాగే క్షయ రోగులతో కలిసి వుండే 6 సంవత్సరాల లోపు పిల్లలకు ‘I.P.T’ అనే పద్దతి ద్వారా క్షయ సోకాకుండా చూడవచ్చు.
PLHIV కేసులకు ముందస్తుగా TB రాకుండా ఉండుటకు TPT 6 నెలలు ఇవ్వటం జరుగుతుంది.
క్షయ రహిత భారతదేశాన్ని నిర్మించుటలో భాగంగా RNTCP లో వచ్చిన వినూత్నమైన సేవలు
- గతంలో క్షయ రోగులు 6 నెలలు మరియు 8 నెలలు చికిత్స తీసుకున్న తరువాతనే వారికి క్షయ ఔషధాలకు నిరోధకత (Drug Resistance) పరీక్షలు నిర్వహించేవారు. కానీ నేడు క్షయ అని గుర్తించగానే Drug Resistance ఉన్నది. లేనిది నిర్ధారించుకుని చికిత్స చేయడం జరుగుతుంది. దీని వల్ల రోగి ఎక్కువ కాలం చికిత్స తీసుకోవలసిన అవసరం తప్పుతుంది. స్వస్థత రేటు ఎక్కువగా ఉంటుంది.
- ఇది వరకు రోజు విడిచి రోజు చికిత్స అందించేవారు, కాని నేడు రోజువారీ చికిత్స విధానం (Daily Regimen) అమలులోనికి వచ్చింది. దీని వల్ల రోగి బరువును బట్టి పిల్స్ వేసుకోవచ్చు. రోజు వేసుకోవడం వల్ల క్రమ పద్దతి చికిత్స అలవడును. తద్వారా రోగి ‘డీఫాల్ట్’ అయ్యే అవకాశం వుండదు.
- గతంలో క్షయ రోగుల వివరాలు రిజిష్టర్స్, రిపోర్ట్స్ ద్వారా మాత్రమే నిర్వచించేవారు. కానీ నేడు నిక్షయ్ అనే పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో కంప్యూటర్ లో నిక్షిప్తం చేయబడుతున్నాయి. దీనిని ఉన్నతాధికారుల నుండి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎప్పటివరకు పరిశీలించే అవకాశం ఉంది.
- తొలిదశలోనే క్షయ రోగిని గుర్తించి వారికి (శరీరంలో ఏ భాగంలో క్షయ లక్షణాలు, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా గుర్తించే) అధునాతన CBNAAT, RTPCR మెషిన్స్ ఇప్పుడు జిల్లా స్థాయిలోనే కాక ఎంపిక చేయబడ్డ ట్రీట్ మెంట్ యూనిట్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.
- గతంలో వేలాది రూపాయలు విలువ చేసే పరీక్షలు మరియు ఔషధాలు రోగులకు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సేవలతో పాటు అధునాతన ఔషధాలు, పరీక్షలు ఇవ్వడమే గాక వారు సరియైన పౌష్టికాహారం చికిత్స కాలంలో తీసుకోవడానికి తోడ్పాటుగా 2018 ఏప్రిల్ నుండి నెలకు రూ.500/- వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీనినే NPY గా వ్యవహరిస్తున్నారు.
- అదే విధముగా క్రొత్తగా క్షయ రోగిని గుర్తించి చికిత్సకు ప్రోత్సహించిన వారికి (Informants) రూ.500/- ఇవ్వడం జరుగుతుంది.
- క్షయ రోగుల చికిత్సకు సహకరించే ట్రీట్ మెంట్ సపోర్టర్స్ పారితోషక౦ రూ.250/- నుండి రూ.1000-5000/- వరకు పెంచడం జరిగింది.
- భారత ప్రభుత్వం ని ‘Notified Disease’ గా గుర్తించి౦ది. (Notification Z-28015/2/2012) తద్వారా క్షయకు చికిత్స అందించే ప్రైవెట్ ఆసుపత్రులు కూడా ఆ వివరాలను సంబంధిత క్షయ నివారణ శాఖాధికారులకు తప్పనిసరిగా అంధించాలి. ఇది ఖచ్చితమైన గణాంకాలకు తోడ్పడుతుంది.
- ప్రైవెట్ మందుల షాపుల వారు కూడా క్షయ రోగులకు చికిస్తా అందించిన వారికి కూడా విధిగా ఆ వివరాలను హెచ్-1 షెడ్యూల్ ‘రిజిష్టర్’ నందు నమోదు చేసి సంబంధిత అధికారులకు అంధించాలి.
- Nikshay Aushadhi, Portel ద్వారా క్షయ నియంత్రణ ఔషదల నిర్వహణ ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షించుట జరుగుతుంది.
ఆశా కార్యకర్త పాత్ర:
- ప్రతి 1000 – జనాభాకు 1 (ఆశా కార్యకర్త)
- గృహ సందర్శనం ద్వారా క్షయ అనుమానితులను గుర్తించుట
- క్షయ అనుమానితులను DMC కి తరలి౦చి వారికి వ్యాధి నిర్ధారణ చేయుటలో సహకరించుట
- క్షయ రోగులకు ట్రీట్ మెంట్ సపోర్టర్ గా వ్యవహరించి వారికి DOTS పద్దతిలో చికిత్స అంధ చేయుట
- చికిత్స కాలంలో నిర్వహించు ఫాలో ఆఫ్ పరీక్షలకు రోగులను సిద్దం చేయుట
- క్షయ రోగికి సక్రమ పద్దతిలో DOTS అండ చేసి వారిని క్షయ వ్యాధి నుండి స్వస్థత పర్చుట
- క్షయ వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా Infants (శిశువలకు) B.C.G Vaccination వేయించుట.
- ANM నుండి సూచనలు : సలహాలు తీసుకొని తనకు నిర్దేశి౦చిన జనాభాతో క్షయ నియంత్రణ కార్యక్రమం సక్రమంగా జరుగునట్లు చూచుట
ANM పాత్ర :
- తనకు నిర్ధేశించిన సచివాలయం / ఉప కేంద్ర౦ నందు ఆశా కార్యకర్తలను సమన్వయించుకొని ప్రతి రోజు గృహ సంధర్శనలో భాగంగా క్షేత్ర పర్యటనలో క్షయ అనుమానితులను గుర్తించుట – వ్యాధి నిర్ధారణకు తోడ్పాటుట
- ట్రీట్ మెంట్ సపోర్టర్ గా వ్యవహరించుట
- DOTS అందిస్తున్న ఆ కార్యకర్తలను తగు సూచనలు ఇస్తూ సకాలంలో Follow-Ups నిర్వహించుట
- క్షయ రోగులు తీసుకువచ్చిన పౌష్టికాహారం గూర్చి వారికి కౌన్సిలింగ్ నిర్వహించుట
- A.E వచ్చిన క్షయ రోగులకు వైధ్యాధికారి వారికి చూపించి DOTS చికిత్స సక్రమంగా జరుగునట్లు చూచుట.
- క్షయ రోగులకు సంబంధించిన రిపోర్ట్స్, రికార్డ్స్ నిర్వహించుట
Comments
Post a Comment