కోవిడ్ వాక్సిన్ కార్యక్రమంలో మరొక ముందడుగు.
భారతదేశ వ్యాప్తంగా చిన్న పిల్లలకు కూడా వాక్సిన్ అందించడానికి ప్రభుత్వం వారు నిర్ణయించినారు. అందులో భాగంగా 12-14సం. లబ్ధిదారులకు CORBEVAX కోవిడ్ వ్యాక్సిన్ మాత్రమే వియోగించవలెను.
అన్ని రాష్ట్రాలలో నేటినుంచి 16.03.2022 బుధవారం వాక్సిన్ కార్యక్రమంలో 12-14 సంవత్సారాల పిల్లలకు తప్పనిసరిగా CORBEVAX వాక్సిన్ చేయడం ప్రారంభం అవుతుంది.
వాక్సిన్ ఇప్పటికే జిల్లా కేంద్రాల నుంచి ప్రతి ఆరోగ్య కేంద్రాలకు చేరడం జరిగింది కాబట్టి ప్రతి ఆరోగ్య కార్యకర్త తమ సచివాలయం లో లేదా వాక్సిన్ కేంద్రాలలో ఈ వాక్సిన్ కార్యక్రమం ప్రారంభించవలెను.
ఈ వాక్సిన్ కి కూడా పాత నిబంధనలు పాటించవలెను.
Comments
Post a Comment