NVBDCP అనగా
- జాతీయ వాహక జనిత రోగ నియంత్రణా కార్యక్రమం
NVBDCP విభాగం లో వ్యాధులు
- 6 వ్యాధులు
- మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జపనీస్ మెదడువాపు, ఫైలేరియాసిస్ మరియు కాలా అజర్
మన ప్రాంతాలలో పెరిగే దోమ రకం
- అనాఫిలిస్ (మలేరియా) దోమ
- క్యూలెక్ (బోధవ్యాధి, మెదడువాపు) దోమ
- ఏడిస్ ( డెంగీ, చికున్ గున్యా) దోమ
- మాన్స్లోనియా (బోధవ్యాధి) దోమ
- ఆర్మీజరీస్ దోమ
- పైన తెలిపిన అన్ని
దోమ రకాలు పెరిగే ప్రాంతాలు కలిగించే వ్యాధి
- అనాఫిలిస్ - మంచి నీటి నిల్వలలో - మలేరియా
- క్యూలెక్ - మురుగు నీటిలో - బోధవ్యాధి, మెదడువాపు
- ఏడిస్ - ఇంటి పరిసరాలలోని నీటి నిల్వలలో - డెంగీ, చికున్ గున్యా
- మాన్స్లోనియా - మొక్కలు ఉన్న నీటి నిల్వలలో - బోధవ్యాధి
- ఆర్మీజరీస్ - సెప్టిక్ ట్యాంకులలో, పరిశ్రమల వ్యర్ధాలు - రక్తం ఎక్కువ పీల్చడం
దోమల వలన వచ్చే వ్యాధులు
- మలేరియా, డెంగీ, చికున్ గున్యా, బోదకాలు, మెదడు వాపు
- టైఫాయిడ్, కామెర్లు
- స్వైన్ ఫ్లూ
- పైన తెలిపిన అన్ని
దోమలు పెరిగే ప్రాంతాలు
- నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో
- చెట్ల పైన
- 500 అడుగుల ఎతైన ప్రాంతాలలో
- పైన తెలిపిన అన్ని
మంచినీటి నిల్వలో పెరిగే దోమ
- అనాఫిలిస్ (మలేరియా) దోమ
- క్యూలెక్ (బోధవ్యాధి, మెదడువాపు) దోమ
- ఏడిస్ ( డెంగీ, చికున్ గున్యా) దోమ
- పైన తెలిపిన అన్ని
వ్యాధి వ్యాప్తి చేయని దోమ
- అనాఫిలిస్ దోమ
- క్యూలెక్ దోమ
- ఏడిస్ దోమ
- ఆర్మీజరీస్
ఆర్మీజరీస్ దోమ చేసే పని
- అధిక రక్తం పీల్చుట
- వ్యాధిని వ్యాప్తి చేయడం
- మరణం సంభవించడం
- పైన తెలిపిన అన్ని
ఆర్మీజరీస్ దోమ చేసే పని
- అధిక రక్తం పీల్చుట
- వ్యాధిని వ్యాప్తి చేయడం
- మరణం సంభవించడం
- పైన తెలిపిన అన్ని
మలేరియా జ్వరం కలిగించే క్రిములు
- ప్లాస్మోడియా - వైవాక్స్
- ప్లాస్మోడియా - ఫాల్సీ ఫారం
- పైన తెలిపిన రెండు
- పైన తెలిపిన రెండు కాదు
మలేరియా జ్వరం కలిగించే క్రిములు ఏ జాతికి చెందినది
- ప్లాస్మోడియా
- ప్లాసమోడిన్నే
- వుచ్చరేరియా బాన్ క్రాఫ్టి
- మాస్మరసు
మలేరియా జ్వరం కి అందించే చికిత్స
వాతావరణ మార్పుల ద్వారా వచ్చే వ్యాధులు
- జలుబు, దగ్గు, స్వైన్ ఫ్లూ
- అతిసార,
- టైఫాయిడ్, కామెర్లు
- పైన తెలిపిన అన్ని
మలేరియా నిర్ధారణ కొరకు రక్త పరీక్ష లో తీసే స్మియర్ సైజు
- Thick Smear (diameter 1-2 cm)
- Thin Smear
- Thick Smear & Thin Smear
- పైన తెలిపినవి ఏవి కాదు
డెంగీ ఈ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది
- టైగర్ దోమ
- లయన్ దోమ
- లిపెర్డ్ దోమ
- క్యూలెక్ దోమ
డెంగీ దోమ ఇలా గుర్తించవచ్చు
- దోమ పైన తెల్లని చారలు ఉంటాయి
- దోమ పొడవుగా ఉంటుంది
- దోమ పూర్తిగా తెల్లగా ఉంటుంది
- దోమకు రెక్కలు ఉండవు
డెంగీ వ్యాధి రకాలు
- డెంగీ జ్వరం
- డెంగీ హేమరేజిక్ జ్వరం
- డెంగీ షాక్ సిండ్రోమ్
- పైన తెలిపిన అన్ని
డెంగీ జ్వరం లక్షణాలు
- జ్వరం, కండరాలు, కీళ్లు, కళ్ళ నొప్పులు
- శరీరము పైన ఎర్రటి దద్దుర్లు, చిగుళ్ల నుండి రక్త స్రావం
- రక్తం లో ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం
- పైన తెలిపిన అన్ని
డెంగీ గురించి
- వైరస్ 4 రకాలు (DENV 1, DENV 2, DENV 3, DENV 4 )
- డెంగీ వైరస్ ఉన్న దోమ కాటు 3 తరవాత నుంచి 14 రోజులలో సోకవచు
- డెంగీ ఒకటికంటే ఎక్కువసార్లు రావచ్చు
- డెంగీ దోమ 400 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఎగురలేదు.
- డెంగీ దోమతో పటు దోమ గుడ్లలో కూడా వైరస్ ఉంటుంది.
- దోమ గుడ్లు మంచి నీటిలో పెడుతుంది.
డెంగీ, చికున్ గున్యా ను గుర్తించడానికి చేసే టెస్ట్
- డోపీలేరు టెస్ట్
- మాక్ ఎలిసా టెస్ట్
- సీరం టెస్ట్
- ఎకో టెస్ట్
కీళ్ల నొప్పులు ఈ క్రింది వ్యాధి ముఖ్య లక్షణం
- మలేరియా
- చికున్ గున్యా
- మెదడు వాపు
- బోద కాలు
పందులు, పక్షుల నుంచి దోమల ద్వారా సోకు వ్యాధి
- మలేరియా
- చికున్ గున్యా
- మెదడు వాపు (జపనీస్ ఎన్సెఫలైటిస్)
- బోద కాలు
మెదడువాపు ను గుర్తించడానికి చేసే టెస్ట్
- డోపీలేరు టెస్ట్
- మాక్ ఎలిసా టెస్ట్
- సీరం / వెన్ను నుండి తీసిన ద్రవం (సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ )
- ఎకో టెస్ట్
ఏనుగు పాదం అని ఏ వ్యాధిని అంటాము
- మలేరియా
- చికున్ గున్యా
- మెదడు వాపు (జపనీస్ ఎన్సెఫలైటిస్)
- బోద కాలు(ఫైలేరియాసిస్)
ఫైలేరియాసిస్ వ్యాధి చికిత్స
- 2 - 5 సం పిల్లలకు - డి.ఇ. సి (100 mg) & అల్బెడోజోల్ (400 mg)
- 6 - 14 సం పిల్లలకు - డి.ఇ. సి (200 mg) & అల్బెడోజోల్ (400 mg)
- 15 + సం అందరికి - డి.ఇ. సి (300 mg) & అల్బెడోజోల్ (400 mg)
కలుషిత నీరు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు
- టైఫాయిడ్
- కామెర్లు
- అతిసార
- పైన తెలిపిన అన్ని
టైఫాయిడ్ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియ
- సాల్మనెల్ల టైఫి
- సాల్మనెల్ కామెర్లు
- సాల్మనెల్ అతిసార
- పైన తెలిపిన అన్ని
టైఫాయిడ్ వ్యాధిని ఈ పరీక్ష ద్వారా గుర్తిచవచ్చు
- వైడాల్ రక్త పరీక్ష
- రక్తం / మలం నుండి కల్చర్
- పైన తెలిపిన రెండిటి ద్వారా
- పైన తెలిపిన రెండిటి ద్వారా కాదు
టైఫాయిడ్ వ్యాధి వలన కలిగే అస్వస్థత
- పేగులలో పుండ్లు పడటం వలన రక్త స్రావం
- మెదడు, గుండె కి సంబంధించిన వ్యాధులు రావడం
- పైన తెలిపిన రెండు సంభవించవచ్చు
- పైన తెలిపిన కాదు
హెపటైటిస్ ఏ అవయవానికి సోకుతుంది
- మూత్రపిండాలకు
- కాలేయానికి
- గుండెకు
- ఊపిరితిత్తులకు
హెపటైటిస్ దేని వలన సోకుతుంది
- మలంతో కలుషితమైన నీరు
- కలుషిత ఆహారం
- కలుషిత మాసం
- పైన తెలిపిన అన్ని
హెపటైటిస్ సోకడానికి పట్టే కాలం
- హెపటైటిస్ ఎ - 14 నుంచి 28 రోజులు (15 to 45)
- హెపటైటిస్ బి - 45 నుంచి 180 రోజులు
- హెపటైటిస్ సి - 15 నుంచి 45 రోజులు
- హెపటైటిస్ ఇ - 14 నుంచి 70 రోజులు
చిన్నపిల్లల్లో ఎక్కువగా కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధి
- అతిసార
- మలేరియా
- బోధ వ్యాధి
- క్షయ
5 సం లోపు చిన్నపిల్లల మరణాలు ఈ వ్యాధి వలన జరుగుతుంది
- అతిసార
- మలేరియా
- బోధ వ్యాధి
- క్షయ
అతిసార కు చికిత్స (విరోచనం అవుతున్నప్పుడు)
- ఓ ఆర్ ఎస్ ద్రావణం
- జింక్ సిరప్
- బలవర్ధక ఆహారం
- ఏమి ఇవ్వకూడదు
అతిసార చికిత్స విరోచనం ఆగిన తరువాత
- ద్రావణం మాత్రమే
- జింక్ సిరప్ 14 రోజులు
- బలవర్ధక మాంసాహారం
- ఏమి ఇవ్వకూడదు
Zoonatic Diseases (జూనోటిక్ వ్యాధులు) అని దేనిని అంటారు
- మనుషుల నుంచి జంతువులకు సోకె వ్యాధులు
- జంతువుల నుంచి జంతువుల సోకె వ్యాధులు
- జంతువుల నుంచి మనుషులకు సోకె వ్యాధులు
- మనుషుల నుంచి మనుషులకు సోకె వ్యాధులు
Zoonatic Diseases (జూనోటిక్ వ్యాధులు) ఏవి
- రేబిస్, ఆంత్రాక్స్
- బ్రూసెల్లోసిస్
- బొవైన్ టి.బి
- లెప్టో స్పారోసిస్
Rabies (రేబిస్) హైడ్రోఫోబియా
- రాబిస్ అనేది ఒక వైరల్ వ్యాధి ,
- ఇది మానవులలో మరియు ఇతర క్షీరదాలలో మెదడు యొక్క వాపుకు కారణమవుతుంది,
- రాబిస్ వైరస్ సాధారణంగా కాటు ద్వారా వ్యాపిస్తుంది
రాబిస్ వ్యాధి లక్షణాలు
- ఆందోళన, గందరగోళం, ముఖంలో గాలి వీచడంతో భయం, భ్రాంతులు
- హైపర్యాక్టివిటీ
- మింగడం కష్టం
- విపరీతమైన లాలాజలం
- నీరు మింగడంలో ఇబ్బంది కారణంగా ద్రవాలు తాగడానికి ప్రయత్నించడం వల్ల భయం ఏర్పడింది
రాబిస్ వ్యాధి ఎలా సోకుతుంది
- రాబిస్ వైరస్ రాబిస్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.
- వైరస్ సోకిన జంతువుల లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది.
- వ్యాధి సోకిన జంతువులు మరొక జంతువు లేదా వ్యక్తిని కాటు వేయడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతాయి.
రేబిస్ కి చికిత్స
- యాంటీ రేబిస్ వాక్సిన్ (ARV) ఇంజక్షన్స్
- కుక్క కరిచినా రోజు నుంచి 6 డోసులు
- మొదటి రోజు, 3 వ, 7 వ, 14 వ, 28 వ మరియు 60 వ రోజు
- గాయం పెద్దది అయితే రేబిస్ హ్యూమన్ ఇమ్మ్యూనోగ్లోబిన్ యాంటీ సీరం వేయాలి
Anthrax (ఆంత్రాక్స్) వ్యాధి రకాలు
- చర్మసంబంధమైన ఆంత్రాక్స్
- గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఆంత్రాక్స్
- ఉచ్ఛ్వాస ఆంత్రాక్స్
- ఇంజెక్షన్ ఆంత్రాక్స్
Anthrax (ఆంత్రాక్స్) వ్యాధి వీటినుంచి సోకుతుంది
- గడ్డి తినే జంతువులూ (మేక, గొర్రె, పశువులు)
- మనుషుల నుంచి
- కాకుల నుంచి
- చెట్ల నుంచి
Anthrax (ఆంత్రాక్స్) వ్యాధి సోకడానికి ఇవి కారణాలు
- బాసిల్లస్ ఆంత్రాసిస్ అను బ్యాక్టీరియా
- బ్యాక్టీరియా తో కలుషితమైన మాంసం తినడం వలన
- టీకా వేయించని పశువులు, వ్యాధి సోకినా పశుమాంసం తినడం వలన
- పైన తెలిపిన అన్ని
ఆంత్రాక్స్ యొక్క అత్యంత తీవ్రమైన సమస్యలు:
- మీ శరీరం సాధారణంగా ఇన్ఫెక్షన్‌కి ప్రతిస్పందించలేకపోతుంది,
- ఇది బహుళ అవయవ వ్యవస్థల (సెప్సిస్) దెబ్బతినడానికి దారితీస్తుంది
- మెదడు మరియు వెన్నుపామును కప్పి ఉంచే పొరలు మరియు ద్రవం యొక్క వాపు,
- భారీ రక్తస్రావం (హెమరేజిక్ మెనింజైటిస్) మరియు మరణానికి దారితీస్తుంది
ఆంత్రాక్స్ నివారణ
యాంటీబయాటిక్స్‌తో
60-రోజుల చికిత్స - సిప్రోఫ్లోక్సాసిన్, డాక్సీసైక్లిన్ మరియు
లెవోఫ్లోక్సాసిన్ పెద్దలు మరియు పిల్లలకు ఆమోదించబడ్డాయి
ఆంత్రాక్స్ వ్యాక్సిన్ యొక్క మూడు-డోస్ సిరీస్ చికిత్స
మోనోక్లోనల్ యాంటీబాడీస్ - రాక్సీబాక్సిమాబ్ మరియు ఓబిల్టోకాక్సిమాబ్‌తో చికిత్స
గాలి ద్వారా సోకు వ్యాధి
- స్వైన్ ఫ్లూ - H1N1 ఫ్లూని స్వైన్ ఫ్లూ అని కూడా అంటారు .
స్వైన్ ఫ్లూ నివారణ :
- స్వైన్ ఇన్ఫ్లుఎంజా నివారణ మూడు భాగాలను కలిగి ఉంటుంది
- పందులలో నివారణ,
- మానవులకు సంక్రమించకుండా నిరోధించడం
- మానవులలో వ్యాప్తి చెందకుండా నిరోధించడం.
- సరైన చేతులు కడుక్కోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.
- కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకడం మానుకోండి.
- జలుబు లేదా ఫ్లూ లక్షణాలను ప్రదర్శించే ఇతరులకు దూరంగా ఉండండి మరియు లక్షణాలను ప్రదర్శించేటప్పుడు ఇతరులతో సంబంధాన్ని నివారించండి.
కోవిడ్ 19
కరోనావైరస్ అనేది మీ ముక్కు, సైనస్ లేదా పై గొంతులో ఇన్ఫెక్షన్ కలిగించే ఒక రకమైన సాధారణ వైరస్.
భారత దేశంలో తయారు చేయబడిన కోవిడ్ 19 వ్యాక్సిన్స్
SARS-CoV-2
- కోవిషీల్డ్ (Covisheeld) - (వైరల్ వెక్టార్ ) ఆక్సఫర్డ్ - ఆస్ట్రాజనకా - సీరం ల్యాబ్, పూణే
- కొవాక్సీన్ (Covaxin)- (ఇన్ యాక్టివేటేడ్ వైరస్) భారత్ బయోటెక్, హైదరాబాద్
- కార్బొవాక్స్ (Corbevax) - (ప్రోటీన్ సబ్ యూనిట్) - అమెరికా
ఇండియా లో కోవిడ్ టీకా మొదట అందించిన తేదీ : 16-జనవరి-2021
- 12 - 14 సంవత్సరాల వయస్సు వారికి కోవిడ్ వాక్సిన్: కార్బొవాక్స్ (Corbevax)
- 15 - 17 సంవత్సరాల వయస్సు వారికి కోవిడ్ వాక్సిన్: కొవాక్సీన్ (Covaxin)
- 18+ సంవత్సరాల వయస్సు వారికి కోవిడ్ వాక్సిన్: కొవాక్సీన్ (Covaxin) / కోవిషీల్డ్ (Covisheeld)
IDSP అనగా
- ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ (సమగ్ర వ్యాధి పరివీక్షణ పధకం)
- దేశవ్యాప్త వ్యాధి నిఘా వ్యవస్థ
- వ్యాధులను ముందస్తుగా గుర్తించడం మరియు దీర్ఘకాలిక పర్యవేక్షణ
IDSP ని IHIP (ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాటుఫారం) గా మార్చనున్నారు
- IDSP నందు నంబర్ రూపంలో ఇస్తారు
- IHIP నందు నేమ్ బేస్డ్ రూపంలో ఇస్తారు
ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ నందు నమోదు చేయవలసిన ఫారం
ఫారం - L : లాబ్ టెక్నిషన్ రిపోర్ట్
ఫారం - P : ఫార్మసిస్ట్ రిపోర్ట్
ఫారం - S : ఆరోగ్య కార్యాకర్త రిపోర్ట్ (సిండ్రోమిక్ రిపోర్ట్)
Comments
Post a Comment