ఆరోగ్య కార్యకర్తలుగా చేస్తున్న (రెగ్యులర్ / కాంట్రాక్టు) ఉద్యోగులకు GNM ప్రమోషన్ క్రింద స్టాఫ్ నర్స్ గా అవకాశం

ఆంధ్రప్రదేశ్ వైధ్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య కార్యకర్తలుగా చేస్తున్న (రెగ్యులర్ / కాంట్రాక్టు) ఉద్యోగులకు ఎవరైతే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫనరీ కోర్స్ చేసి ఉంటారో వారందరికీ ఒకసారి ప్రమోషన్ క్రింద స్టాఫ్ నర్స్ గా నియమించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. 

జి.ఓ ఎం.స్ నం 57 హెచ్ఎమ్ & ఎఫ్ డబ్ల్యూ (జి 2) డిపార్ట్మెంట్ డేట్ 24.03.2022 అనుసరించి ఎవరైతే రెగ్యులర్ / కాంట్రాక్టు ఎమ్ పి హెచ్ డబ్ల్యూ (ఎఫ్) / ఏ ఎన్ ఎమ్ గా పనిచేస్తున్న వారు ఇన్-సర్వీస్ కోటాలో కానీ లేదా అంతకుముందుగా జనరల్ నర్సింగ్ మిడ్ వైఫనరీ కోర్స్ (GNM) పూర్తి చేసి ఉంటె వారందరికీ 30.03.2022 కి ప్రమోషన్ క్రింద స్టాఫ్ నర్స్ పోస్ట్ కి ప్రమోట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

  1. రెగ్యులర్ ఎమ్ పి హెచ్ డబ్ల్యూ (ఎఫ్) / ఏ ఎన్ ఎమ్ గా చేస్తున్న వారికీ -- రెగ్యులర్  స్టాఫ్ నర్స్. 
  2. కాంట్రాక్టు ఎమ్ పి హెచ్ డబ్ల్యూ (ఎఫ్) / ఏ ఎన్ ఎమ్ గా చేస్తున్న వారికీ -- కాంట్రాక్టు  స్టాఫ్ నర్స్. 
  3. ప్రమోషన్ పోస్టులను భర్తీ చేసే వాటిలో రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం సీనియారిటీ లిస్ట్ ని 28.03.2022లోపు సిద్ధం చేయాలి. 
  4. రెగ్యులర్ / కాంట్రాక్టు అభ్యర్థుల జాబితా మరియు రెగ్యులర్ / కాంట్రాక్టు పోస్టుల ఖాళీల జాబితాను ప్రదర్శించవలసింగినా తెలియ చేయడం జరిగింది. 
  5. 30.03.2022 న ఉదయం కౌన్సిలింగ్ నిర్వహించి సాయంత్రం లోపు వారందరికీ నియామక పత్రాలు అందచేయాలి. 
  6. 31.03.2022 న నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు అందరు ఎమ్ పి హెచ్ డబ్ల్యూ (ఎఫ్) / ఏ ఎన్ ఎమ్ గారిలీవ్ అవ్వాలి.
  7. 01.04.2022 న స్టాఫ్ నర్స్ గా నియమించిన చోట రిపోర్ట్ చేసి చేరవలసి ఉంటుంది. 

ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు లేకుండా పూర్తి చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. 

 వీడియో కొరకు క్లిక్ చేయండి 


 



Comments