Skip to main content
IMI - 4.0 ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్
I M I - 4.0
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్
మిషన్ ఇంద్ర ధనుష్ వాక్సినేషన్ - సూచనలు.
వాక్సిన్ కార్యక్రమం కచ్చితంగా ఉదయం 9:00 కు మొదలు పెట్టవలెను.
అన్ని రకముల వాక్సిన్ యాంటిజెన్స్ ప్రతి సెషన్ నందు తప్పనసరిగా ఉండవలెను.
ఆశ మరియు అంగన్వాడీ వర్కర్ తప్పనిసరిగా వాక్సినేషన్ వేయించుకోని పిల్లల లిస్ట్ తో సహా వాక్సిన్ జరిగే స్థలము నందు ఉండవలెను.
వాక్సిన్ వేయించుకోవాలిసిన పిల్లల తల్లులకు సమయం మరియు స్థలము సమాచారము తప్పనిసరిగా తెలుపవలయును.
వాక్సిన్ చేయడంతో పటు ప్రతి బెనెఫిషరీ MCP కార్డు లో వాక్సిన్ వివరాలు నింపవలెను వారి వద్ద కార్డు లేనిచో కొత్త కార్డు ఇచ్చి పూర్తి వివరాలు నింపవలెను.
సెషన్ సైట్ నందు Red & Black, బయో వెస్టెజ్ బాగ్, హబ్ కట్టర్ కచ్చితంగా ఏర్పాటు చేసుకోవలెను.
పిల్లలందదరిని సొంత బిడ్డలా భావించి వాక్సిన్ వేయవలను.
ఏ వయస్సు పిల్లలకు ఏ వాక్సిన్ వెయ్యాలో సరిచూసుకుని ఆ వాక్సిన్ మాత్రమే వెయ్యవలయును.
ప్రతి ఒక్కరూ దయ ఉంచి జాగ్రత్తగా మిషన్ ఇంద్ర ధనుష్ వాక్సినేషన్ ను 100% సాధించవలయును.
మిషన్ ఇంద్రధనుష్ ముఖ్య ఉద్దేశం:
కోవిడె పాండమిక్ కారణంగా గర్భవతులు మరియు పిల్లలకు వేయవలసిన వాక్సిన్ వేయలేక పోవడం తో లేక వారు అందుకోలేక పోవడం జరిగిందని NHFS సర్వే ద్వారా గ్రహించడం జరిగింది.
వారందరికీ గుర్తించి ఇప్పుడు మిస్ అయినటువంటి వాక్సిన్ చేసి వారిని పూర్తి వాక్సిన్ అందేవిధంగా చేయడం.
మిషన్ ఇంద్రధనుష్ లో ఎవరికి :
వాక్సిన్ పాక్షికంగా లేదా పూర్తిగా అందుకోలేని 2 సంవత్సరాల లోపు పిల్లలు (0 - 23 నెలలు).
వాక్సిన్ పాక్షికంగా లేదా పూర్తిగా అందుకోలేని గర్భవతులు
మిషన్ ఇంద్రధనుష్ చేయవలసి వ్యవధి :
మొదటి రౌండ్ : 7 మార్చి నుంచి 13 మార్చి వరకు
రెండొవ రౌండ్ : 4 ఏప్రిల్ నుంచి 10 ఏప్రిల్ వరకు
మూడొవ రౌండ్ : 2 మే నుంచి 8 మే వరకు
Comments
Post a Comment