I -NIPI / విటమిన్ ఎ / క్షయ వ్యాధి / కుష్టు వ్యాధి
NIPI ఏమి ?
a. నేషనల్ ఐరన్ ప్లస్ ఇనిషియేటివ్
b. నేషనల్ ఐరన్ ఫాస్ఫర్స్ ఇనిషియేటివ్
c. నేషనల్ ఐసి ప్లస్ ఇనిషియేటివ్
d. పైన తెలిపినవి అన్ని
నేషనల్ ఐరన్+ ఇనిషియేటివ్ కింద ఐరన్ యొక్క లబ్ది ఎవరికి కోసం ప్రతిపాదించబడింది
a . 6 నెలల వయస్సు నుండి 59 నెలల వరకు వారికీ
b . కౌమారదశ వయస్సు వారికీ మరియు పునరుత్పత్తి వయస్సులో ఉన్న మహిళలకు
c . గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలకు
d. పైన తెలిపినవి అందరికి
నేషనల్ ఐరన్+ ఇనిషియేటివ్ కింద ఎన్ని నెలల కాలానికి ఐరన్ సిరప్ ప్రతిపాదించబడింది
a . 6 నెలల వయస్సు నుండి 59 నెలల వరకు
b . 6 నెలల వయస్సు వారికీ మాత్రమే
c . 60 నెలల వయస్సు వారికీ మాత్రమే
d. 6 సంవత్సరాల పిల్లలకి
నేషనల్ ఐరన్+ ఇనిషియేటివ్ కింద 6-59 నెలల పిల్లలకి ఇవ్వవలిసిన మోతాదు
a. 1ml IFA
b. 10 ml IFA
c. 100 ml IFA
d. 1000 ml IFA
నేషనల్ ఐరన్+ ఇనిషియేటివ్ కింద 6-59 నెలల పిల్లలకి ఇవ్వవలిసిన మోతాదు
a. 1ml IFA సిరప్ వారానికి 2 సార్లు
b. 10 ml IFA సిరప్ వారానికి 2 సార్లు
c. 45 mg IFA టాబ్లెట్ వారానికి ఒకటి
d. 100 mg IFA టాబ్లెట్ 180 రోజులు ఒకటి చొప్పున
IFA లో ఏమి ఉంటాయి
a. ఐరన్ మరియు ఫాంటాసిడ్
b. ఐరన్ మరియు ఫాస్ఫరస్ యాసిడ్
c. ఐరన్ మరియు ఫ్యాటీ యాసిడ్
d. ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్
నేషనల్ ఐరన్+ ఇనిషియేటివ్ కింద 6-59 నెలల పిల్లలకి ఇవ్వవలిసిన మోతాదు ప్రతి 1 ml ద్రవ సూత్రీకరణ
a. 20 mg మూలక ఇనుము మరియు 100 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
b. 200 mg మూలక ఇనుము మరియు 1000 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
c. 20 మైక్రోగ్రామ్ (mcg) ఇనుము మరియు 100 mg మూలక ఫోలిక్ యాసిడ్
d. 200 మైక్రోగ్రామ్ (mcg) ఇనుము మరియు 1000 mg మూలక ఫోలిక్ యాసిడ్
6 నుండి 10 సంవత్సరాలు వరకు
పిల్లలకు ఇవ్వవలిసిన IFA టాబ్లెట్ మోతాదు
a . 450 mg మూలక ఇనుము మరియు 1000 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
b . 45 mg ఎలిమెంటల్ ఐరన్ మరియు 400 mcg ఫోలిక్ యాసిడ్
c . 450 mg మూలక ఇనుము మరియు 4000 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
d. 20 mg మూలక ఇనుము మరియు 100 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
6 నుండి 10 సంవత్సరాలు వరకు ఏక్కడి పిల్లలకు IFA ఇవ్వవలెను
a . ప్రభుత్వం పాఠశాలలు వద్ద
b . AWC పిల్లలకు
c . బడి బయట పిల్లలకు
d. పైన తెలిపినవి అన్ని
నేషనల్ ఐరన్+ ఇనిషియేటివ్ కింద 6 నుండి 10 సంవత్సరాలు వరకు ఇవ్వవలిసిన మోతాదు
a. 45 mg IFA టాబ్లెట్ వారానికి ఒక్కసారి
b. ఒక IFA టాబ్లెట్ వారానికి 2 సార్లు
c. 45 mg IFA టాబ్లెట్ వారానికి సరిపడా
d. 100 mg IFA టాబ్లెట్ 180 రోజులు ఒకటి చొప్పున
WIFS అనగా ఏమి
a . వైర్ లెస్ ఇంటర్నెట్ ఫైబర్ సిస్టం
b . వైరస్ ఇన్ ఫోలిక్ యాసిడ్
c . వీక్లీ ఇమ్మ్యూనిటి ఫుడ్ సప్లిమెంటేషన్
d. వీక్లీ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్
కౌమారదశ ఎప్పటివరకు
a . 1–9
సంవత్సరాలు
b . 6–59 నెలలు
c . 10–29 సంవత్సరాలు
d. 10–19 సంవత్సరాలు
WIFS ప్రోగ్రామ్ కింద కౌమారదశ లో ఇవ్వవలసిన వారపు మోతాదు
a. 100 mg మూలక ఇనుము మరియు 500 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
b. 200 mg మూలక ఇనుము మరియు 1000 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
c. 100 మైక్రోగ్రామ్ (mcg) ఇనుము మరియు 100 mg మూలక ఫోలిక్ యాసిడ్
d. 200 మైక్రోగ్రామ్ (mcg) ఇనుము మరియు 1000 mg మూలక ఫోలిక్ యాసిడ్
WIFS ప్రోగ్రామ్ కింద కౌమారదశ లో ఇవ్వవలసిన మోతాదు
A . 100 mg మూలక ఇనుము మరియు 500 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
B . ద్వివార్షిక డీ-వార్మింగ్
a. B మాత్రమే ఇవ్వాలి
b. A మాత్రమే ఇవ్వాలి
c. A & B ఇవ్వవలెను
d. A & B రెండు ఇవ్వకూడదు
పునరుత్పత్తి వయస్సులో ఉన్న మహిళలకు వారంవారీ సప్లిమెంట్
a. 100 mg మూలక ఇనుము మరియు 500 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
b. 200 mg మూలక ఇనుము మరియు 1000 మైక్రోగ్రామ్ (mcg) ఫోలిక్ యాసిడ్
c. 100 మైక్రోగ్రామ్ (mcg) ఇనుము మరియు 100 mg మూలక ఫోలిక్ యాసిడ్
d. 200 మైక్రోగ్రామ్ (mcg) ఇనుము మరియు 1000 mg మూలక ఫోలిక్ యాసిడ్
గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలకు IFA ఇవ్వవలసిన రోజులు మోతాదు
a. 100
b. 120
c. 180
d. 80గర్భిణీ స్త్రీలకు IFA మొదలు పెట్టవలసిన సమయం
a. 12 వారాల లోపు
b. 13 వారాల తరవాత
c. 18 వారాల తరవాత
d. 32 వారాల తరవాతరక్త హీనతకు కారణమలు
a. విటమిన్ B12 లోపం
b. ఫోలేట్ మరియు విటమిన్ A లోపం
c. పోషకాహార లోపాలు
d. పైన అన్నిజాతీయ విటమిన్ ఎ రోగనిరోధక కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు
- 1970
- 1980
- 1990
- 2000
జాతీయ విటమిన్ ఎ రోగనిరోధక కార్యక్రమం ఎందుకు ప్రారంభించారు
- పోషకాహార అంధత్వానికి వ్యతిరేకంగా
- అంధత్వతో పిల్లలు పుట్టకుండా
- గర్భిణీలకు పోషకాహారం కొరకు
- పైన వేవి కాదు
విటమిన్ ఎ ఎన్ని సంవత్సరాల వరకు యెంత మోతాదు అందించవలసి ఉంటుంది
- 9 నెలల నుండి 5 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి 6 నెలలకు 200000 IU
- 9 నెలల నుండి 15 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి 6 నెలలకు 200000 IU
- 9 నెలల నుండి 18 నెలల వయస్సు వరకు ప్రతి 6 నెలలకు 200000 IU
- 9 నెలల నుండి 28 నెలల వయస్సు వరకు ప్రతి 6 నెలలకు 200000 IU
విటమిన్ ఎ లోపం వలన సంభవించేవ్యాధి
- రేచీకటి
- రేబిస్
- బెరిబెరి
- రికెట్స్
- 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అనారోగ్యాన్ని తగ్గించడానికి - శ్వాసకోశ మరియు గ్యాస్ట్రో పేగు ఇన్ఫెక్షన్లను తగ్గించడం ద్వారా
- Bi - 9 నెలల నుండి 5 సంవత్సరాల వయస్సు వరకు విటమిన్ - A యొక్క వార్షిక పరిపాలన
- 9-12 నెలల వయస్సు ఉన్న పిల్లలందరినీ జాబితా చేయండి మరియు ప్రతి బిడ్డకు 1 ml మొదటి మోతాదు ఇవ్వండి.
- 12-59 నెలల వయస్సు గల పిల్లలందరినీ జాబితా చేయండి మరియు ప్రతి బిడ్డకు 2 ml చొప్పున రెండవ నుండి ఐదవ డోస్ ఇవ్వండి.
మన దేశంలో క్షయను అంతం చేయాలని లక్ష్య౦
a. 2025 నాటికి
b. 2022 నాటికి
c. 2024 నాటికి
d. 2023 నాటికి
క్షయను దేనివల్ల సోకుతుంది
a. బ్యాక్టీరియా
b. ఫంగస్
c. కీటకం
d. దోమ
క్షయను దేనివల్ల సోకుతుంది
a. మైక్రోబ్యాక్టీరియ౦ట్యూబర్క్యూలై
b. మైక్రోబ్యాక్టీరియ౦పీలేకు
c. మైక్రోబ్యాక్టీరియ౦వాస్కులే
d. మైక్రోబ్యాక్టీరియ౦లెఫ్ట్
క్షయను నిర్ధారణ దీనిని బట్టి చేస్తారు
a. రెండు వారాలు పైబడి దగ్గు, కఫం లేదా కళ్ళే పడుట
b. సాయంకాల వేళ వచ్చే జ్వరం, ఛాతిలో నొప్పి
c. ఆకలి తగ్గుట మరియు బరువు తగ్గుట
d. పైన తెలిపినవి అన్ని
క్షయను నిర్ధారణ పరీక్ష దీనిని ద్వారా చేస్తారు
a. CBNAAT
b. FNAC
c. RTPCR
d. పైన తెలిపినవి అన్ని
క్షయ దీని ద్వారా సోకుతుంది
a. క్షయ రోగి దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా
b. క్షయ రోగి తాకడం వలన
c. ఎండలో తిరగడం వలన
d. పైన తెలిపినవి అన్ని
క్షయ రాకుండా చేసే వాక్సిన్
a. బీసీజీ
b. పెంటావాలెంట్
c. మీజిల్స్ రుబెల్లా
d. పైన తెలిపినవి అన్ని
NLEP అనగా ఏమిటి
- జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం
- జాతీయ కుష్టు వ్యాధి నిరోధక కార్యక్రమం
- జాతీయ కుష్టు వ్యాధి నిర్మాణ కార్యక్రమం
- జాతీయ కుష్టు వ్యాధి నిర్బంధ కార్యక్రమం
కుష్టువ్యాధి ని కలిగించే బ్యాక్టీరియా
- మైకోబాక్టీరియం లెప్రే
- మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్
- మైకోబాక్టీరియం కుస్ట్
- పైన తెలిపినవేవి కావు
కుష్టువ్యాధి ని కలిగించే బ్యాక్టీరియా ఇలా వ్యాపిస్తుంది
- మల్టీ-బాసిలరీ లెప్రసీ (తీవ్రమైన రూపం) యొక్క చికిత్స చేయని కేసు నుండి ఇతరులకు డ్రాప్-లెట్ (గాలి ద్వారా) ద్వారా
- బహుళ-బాసిల్లరీ లెప్రసీ దగ్గు ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు వ్యాపిస్తుంది.
- పైన రెండిటి ద్వారా
- పైన తెలిపి వాటితో కాదు
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం
- దేశంలోని అన్ని జిల్లాల్లో 10,000 జనాభాకు 1 కంటే తక్కువ కేసుల వ్యాప్తి అంటే కుష్టు వ్యాధి నిర్మూలన.
- కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల వైకల్య నివారణ & వైద్య పునరావాసాన్ని బలోపేతం చేయండి.
- కుష్టు వ్యాధితో సంబంధం ఉన్న స్టిగ్మా స్థాయి తగ్గింపు.
- పైన తెలిపిన అన్ని
కుష్టు వ్యాధి సంభవించే నష్టం
- పరిధీయ నరాలను నాశనం చేస్తుంది కాబట్టి చర్మపు స్పర్శను కోల్పోవడంతో పాటు చర్మంపై మచ్చలు ఏర్పడతాయి
- కనురెప్పలతో సహా చేతులు, పాదాలు, ముఖం యొక్క కండరాల పక్షవాతానికి కూడా దారితీయవచ్చు.
- కుష్టు వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే ముఖం, చేతులు మరియు కాళ్లు వైకల్యం కలిగిస్తాయి.
- పైన తెలిపిన అన్ని
కుష్టు వ్యాధి గుర్తించడం ఎలా
- కుష్టు వ్యాధిని చర్మపు అనుభూతిని, కండరాల పనితీరును పరిశీలించడం ద్వారా
- చర్మపు స్క్రాపింగ్‌ల యొక్క మైక్రోస్కోపిక్ పరీక్ష ద్వారా
- చర్మ పైన రాగి రంగు మాచనలను గుర్తించడం ద్వారా
- పైనతెలిపిన అన్ని
కుష్టు వ్యాధికి చికిత్స కాలం
- 6 నుండి 12 నెలల పాటు బహుళ ఔషధ చికిత్స ద్వారా చికిత్స చేస్తారు.
కుష్టు వ్యాధికి ప్రారంభ దశలో గుర్తిస్తే నివారించగలరా?
ప్రారంభ
దశలో చేతులు, పాదాలు/కాళ్లు మొదలైనవి వైకల్యంతో ఉన్న కుష్టు వ్యాధితో
బాధపడుతున్న వ్యక్తులు పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేయించుకోవచ్చు మరియు
వైకల్యాన్ని సరిదిద్దవచ్చు.
కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల కోసం సంక్షేమ చర్యలు
- అరికాళ్లపై ఎలాంటి సంచలనం లేని వారికి మైక్రో సెల్యులార్ రబ్బర్ ఫుట్ వేర్ సదుపాయం
- అర్హులైన వ్యక్తులకు వికలాంగుల పెన్షన్ రూ.1500/- అందించడం
- అంత్యోదయ కార్డులు-నెలవారీ రేషన్ బియ్యం అందజేస్తారు
- రైల్వే ఉచిత ప్రయాణ పాస్
- ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ రాయితీలు ఉంటాయి
- రీ-కన్‌స్ట్రక్టివ్ సర్జరీ చేయించుకున్న వారికి రూ.8000/- ప్రోత్సాహకం
క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం
క్షయ వ్యాధి అంటే : “మైక్రోబ్యాక్టీరియ౦ట్యూబర్క్యూలై” అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి
వ్యాధి వ్యాప్తి చెందే విధానం : క్షయ రోగి దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా
(Droplet Infection)
వ్యాధి లక్షణాలు : 1. రెండు వారాలు పైబడి దగ్గు, కఫం లేదా కళ్ళే పడుట,
కఫంలో రక్తం పడుట
2. సాయంకాల వేళ వచ్చే జ్వరం, ఛాతిలో నొప్పి
3. ఆకలి తగ్గుట మరియు
4. బరువు తగ్గుట
వ్యాధి నిర్ధారణ : అన్నీ మైక్రోస్కోపిక్ సెంటర్సో నిర్వహించే కఫలం లేదా
కళ్ళే పరీక్ష ద్వారా, ఇంకా X-ray, “FNAC” RTPCR మరియు “CBNAAT” పద్దతుల ద్వారా
క్షయలోని రకాలు : క్షయ ముఖ్యంగా రెండు రకాలు:
1. ఊపిరితిత్తులకు సంక్రమి౦చ్చే పల్మనరీ TB. 2. శరీరంలోని ఇతర భాగాలకు సోకే ఎక్స్ ట్రా పల్మనరీTB
- అయితే కఫంలో ‘బాసిలై’ ఉన్నట్లు పరీక్షలో తేలితే, ఆ క్షయ మాత్రమే ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే ప్రమాదము ఉంది.
క్షయ తీవ్రత : ప్రపంచంలోని మొత్తం కేసులలో 5వ వంతు మన భారత దేశంలో ఉన్నాయి.
- రోజు 5 వేల మందికి, సంవత్సరంలో 18 లక్షల మందికి వ్యాధి సంక్రమణం జరుగుతుంది.
- సగటున రోజుకి 1500 మంది క్షయ కారణముగా మరణిస్తున్నారు. కావున 2025 నాటికి మన దేశంలో క్షయను అంతం చేయాలని లక్ష్య౦.
- దీనిలో భాగంగానే కొత్త కొత్త పరీక్ష విధానాలను తీసుకొని రావటం జరిగింది.
క్షయను సమర్ధవంతముగా నియంత్రించే ఔషధాలు
ఔషధాలు : ఐసోనియాజిడ్, రీఫంప్సిన్, పైరజినమైడ్ మరియు ఇధాంబూటల్ మొదలగునవి.
నూతనంగా “బిడాక్విలిన్” అనే ఔషధ౦
చికిత్స కాలం : క్రొత్తగా గుర్తించిన ఔషధ నిరోధకత లేని రోగులకు “6” నెలలు. రెసిస్టెన్స్ గల రోగులకు (MDR.TB) 6-18 నెలలు. సరియైన పద్దతిలో క్షయ రోగులు చికిత్స పొందినచో ‘పూర్తి స్వస్థత’ పొందవచ్చు.
క్షయ రోగులు : వైద్యులు సూచించిన ప్రకారం ట్రీట్ మెంట్ సపోర్టర్స్ పర్యవేక్షణలో పూర్తి చికిత్స క్రమ పద్దతిలో తీసుకోవాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు : చికిత్స కాలంలో నిర్వహించే పరీక్షలకు సహకరించాలి. (ఫాలో అప్స్) గ్రుడ్లు, పాలు, ఆకుకూరలు మరియు పప్పు దినుసులు, పండ్లు వంటి పోషకాహార౦ తీసుకోవాలి.
ముందుస్తు జాగ్రత్త : సంవత్సరం లోపు పిల్లలందరికి వారికి భవిష్యత్ లో క్షయ రాకుండా ‘BCG’ టీకా వేయించుట ద్వారా, అలాగే క్షయ రోగులతో కలిసి వుండే 6 సంవత్సరాల లోపు పిల్లలకు ‘I.P.T’ అనే పద్దతి ద్వారా క్షయ సోకాకుండా చూడవచ్చు.
PLHIV కేసులకు ముందస్తుగా TB రాకుండా ఉండుటకు TPT 6 నెలలు ఇవ్వటం జరుగుతుంది.
క్షయ రహిత భారతదేశాన్ని నిర్మించుటలో భాగంగా RNTCP లో వచ్చిన వినూత్నమైన సేవలు
- గతంలో క్షయ రోగులు 6 నెలలు మరియు 8 నెలలు చికిత్స తీసుకున్న తరువాతనే వారికి క్షయ ఔషధాలకు నిరోధకత (Drug Resistance) పరీక్షలు నిర్వహించేవారు. కానీ నేడు క్షయ అని గుర్తించగానే Drug Resistance ఉన్నది. లేనిది నిర్ధారించుకుని చికిత్స చేయడం జరుగుతుంది. దీని వల్ల రోగి ఎక్కువ కాలం చికిత్స తీసుకోవలసిన అవసరం తప్పుతుంది. స్వస్థత రేటు ఎక్కువగా ఉంటుంది.
- ఇది వరకు రోజు విడిచి రోజు చికిత్స అందించేవారు, కాని నేడు రోజువారీ చికిత్స విధానం (Daily Regimen) అమలులోనికి వచ్చింది. దీని వల్ల రోగి బరువును బట్టి పిల్స్ వేసుకోవచ్చు. రోజు వేసుకోవడం వల్ల క్రమ పద్దతి చికిత్స అలవడును. తద్వారా రోగి ‘డీఫాల్ట్’ అయ్యే అవకాశం వుండదు.
- గతంలో క్షయ రోగుల వివరాలు రిజిష్టర్స్, రిపోర్ట్స్ ద్వారా మాత్రమే నిర్వచించేవారు. కానీ నేడు నిక్షయ్ అనే పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో కంప్యూటర్ లో నిక్షిప్తం చేయబడుతున్నాయి. దీనిని ఉన్నతాధికారుల నుండి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎప్పటివరకు పరిశీలించే అవకాశం ఉంది.
- తొలిదశలోనే క్షయ రోగిని గుర్తించి వారికి (శరీరంలో ఏ భాగంలో క్షయ లక్షణాలు, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా గుర్తించే) అధునాతన CBNAAT, RTPCR మెషిన్స్ ఇప్పుడు జిల్లా స్థాయిలోనే కాక ఎంపిక చేయబడ్డ ట్రీట్ మెంట్ యూనిట్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.
- గతంలో వేలాది రూపాయలు విలువ చేసే పరీక్షలు మరియు ఔషధాలు రోగులకు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సేవలతో పాటు అధునాతన ఔషధాలు, పరీక్షలు ఇవ్వడమే గాక వారు సరియైన పౌష్టికాహారం చికిత్స కాలంలో తీసుకోవడానికి తోడ్పాటుగా 2018 ఏప్రిల్ నుండి నెలకు రూ.500/- వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీనినే NPY గా వ్యవహరిస్తున్నారు.
- అదే విధముగా క్రొత్తగా క్షయ రోగిని గుర్తించి చికిత్సకు ప్రోత్సహించిన వారికి (Informants) రూ.500/- ఇవ్వడం జరుగుతుంది.
- క్షయ రోగుల చికిత్సకు సహకరించే ట్రీట్ మెంట్ సపోర్టర్స్ పారితోషక౦ రూ.250/- నుండి రూ.1000-5000/- వరకు పెంచడం జరిగింది.
- భారత ప్రభుత్వం ని ‘Notified Disease’ గా గుర్తించి౦ది. (Notification Z-28015/2/2012) తద్వారా క్షయకు చికిత్స అందించే ప్రైవెట్ ఆసుపత్రులు కూడా ఆ వివరాలను సంబంధిత క్షయ నివారణ శాఖాధికారులకు తప్పనిసరిగా అంధించాలి. ఇది ఖచ్చితమైన గణాంకాలకు తోడ్పడుతుంది.
- ప్రైవెట్ మందుల షాపుల వారు కూడా క్షయ రోగులకు చికిస్తా అందించిన వారికి కూడా విధిగా ఆ వివరాలను హెచ్-1 షెడ్యూల్ ‘రిజిష్టర్’ నందు నమోదు చేసి సంబంధిత అధికారులకు అంధించాలి.
- Nikshay Aushadhi, Portel ద్వారా క్షయ నియంత్రణ ఔషదల నిర్వహణ ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షించుట జరుగుతుంది.
ఆశా కార్యకర్త పాత్ర:
- ప్రతి 1000 – జనాభాకు 1 (ఆశా కార్యకర్త)
- గృహ సందర్శనం ద్వారా క్షయ అనుమానితులను గుర్తించుట
- క్షయ అనుమానితులను DMC కి తరలి౦చి వారికి వ్యాధి నిర్ధారణ చేయుటలో సహకరించుట
- క్షయ రోగులకు ట్రీట్ మెంట్ సపోర్టర్ గా వ్యవహరించి వారికి DOTS పద్దతిలో చికిత్స అంధ చేయుట
- చికిత్స కాలంలో నిర్వహించు ఫాలో ఆఫ్ పరీక్షలకు రోగులను సిద్దం చేయుట
- క్షయ రోగికి సక్రమ పద్దతిలో DOTS అండ చేసి వారిని క్షయ వ్యాధి నుండి స్వస్థత పర్చుట
- క్షయ వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా Infants (శిశువలకు) B.C.G Vaccination వేయించుట.
- ANM నుండి సూచనలు : సలహాలు తీసుకొని తనకు నిర్దేశి౦చిన జనాభాతో క్షయ నియంత్రణ కార్యక్రమం సక్రమంగా జరుగునట్లు చూచుట
ANM పాత్ర :
- తనకు నిర్ధేశించిన సచివాలయం / ఉప కేంద్ర౦ నందు ఆశా కార్యకర్తలను సమన్వయించుకొని ప్రతి రోజు గృహ సంధర్శనలో భాగంగా క్షేత్ర పర్యటనలో క్షయ అనుమానితులను గుర్తించుట – వ్యాధి నిర్ధారణకు తోడ్పాటుట
- ట్రీట్ మెంట్ సపోర్టర్ గా వ్యవహరించుట
- DOTS అందిస్తున్న ఆ కార్యకర్తలను తగు సూచనలు ఇస్తూ సకాలంలో Follow-Ups నిర్వహించుట
- క్షయ రోగులు తీసుకువచ్చిన పౌష్టికాహారం గూర్చి వారికి కౌన్సిలింగ్ నిర్వహించుట
- A.E వచ్చిన క్షయ రోగులకు వైధ్యాధికారి వారికి చూపించి DOTS చికిత్స సక్రమంగా జరుగునట్లు చూచుట.
- క్షయ రోగులకు సంబంధించిన రిపోర్ట్స్, రికార్డ్స్ నిర్వహించుట
Comments
Post a Comment