ANM స్కూల్ హెల్త్ (ANM AP Health APP)


 

ANM స్కూల్ హెల్త్ (ANM AP Health APP)

ANM AP Health APP లో Covid అప్లికేషన్ల లాగిన్ లో కొత్తగా ANM స్కూల్ హెల్త్ మాడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది. అందులో 2 వర్క్స్ ని ఇవ్వడం జరిగింది. 

1. స్కూల్ స్టూడెంట్స్ ని స్క్రీనింగ్ చేయడం 

2. స్కూల్ పరిసరాల పరిశుభ్రత వివరాలు 

ప్రతి నెలకు ఒకసారి ఈ కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది. 

ముందుగా సచివాలయం సెలెక్ట్ చేయవలెను. 



స్కూల్ ని సెలెక్ట్ చేయవలెను.

 చేయవలసిన టాస్క్ సెలెక్ట్ చేసుకోవాలి 

 

స్కూల్ స్టూడెంట్స్ ని స్క్రీనింగ్ చేయడం 

ప్రతి స్కూల్ లో ఉన్న పిల్లవాని ఎత్తు, బరువు, అనీమియా వివరములు నమోదు చేయవలెను. 

 

స్టూడెంట్ యొక్క ఎత్తు మీటర్లో మాత్రమే వేయాలి బరువు కేజీ లో వేయాలి దానిని బట్టి ఆ స్టూడెంట్ యొక్క BMI వస్తుంది. 

ఎత్తు 115 సెంటీమీటర్ ఉంటె దానిని 1.15 మీటర్లు అంటారు కాబట్టి ఎత్తు దగ్గర 1.15 వేయవలెను


స్టూడెంట్ స్క్రీనింగ్ పూర్తి అయిన  తరువాత మాత్రమే స్కూల్ పరిశుభ్రత వివరములు పూర్తి చేయవలెను. 

ముందుగా స్కూల్ పరిశుభ్రత వివరములు పూర్తి చేసేస్తే స్టూడెంట్స్ స్క్రీనింగ్ క్లోజ్ అయిపోతుంది మరల తరువాత నెలకు మాత్రమే ఓపెన్ అవుతుంది.

స్కూల్ పరిసరాల పరిశుభ్రత వివరాలు 

స్కూల్ పరిసరాల పరిశుభ్రత వివరాలు నమోదులో ఎక్కడైనా సరిగా లేనిచో వాటికీ సంబందించిన ఫోటో అప్ లోడ్ చేయవలెను. 


ప్రస్తుతం స్కూల్ కి సెలవలు కాబట్టి స్టూడెంట్స్ స్క్రీనింగ్ మరల స్కూల్స్ తెరిచినా తరువాత చేయవలెను. 

21.05.2022 శనివారం తప్పనిసరిగా అందరు స్కూల్ పరిసరాల పరిశుభ్రత సంబంధిత సమాచారం పూర్తి చేయవలెను. 

 

వీడియో కొరకు  క్లిక్ చేయండి 


 


 

Comments