ఇంటిగ్రేటెడ్ RCH రిజిస్టర్ రాయడం ఎలా ? తెలుసుకుందాం 👪 (

 పూర్తి సమాచారం 25.05.2022 లోపు చేసుకోగలరు 

ఇంటిగ్రేటెడ్ RCH 2.0 రిజిస్టర్ రాయడం ఎలా ?

ప్రతి 1000 జనాభాకి ఒక రిజిస్టర్ తప్పనిసరిగా రాయవలెను. 

ప్రతి 1000 జనాభాకి ఒక ఆషా కార్యకర్త ఉంటుంది కాబట్టి ఒక ఆషాకి ఒక రిజిస్టర్ చొప్పున రాయవలెను. 

ఆ గ్రామంలో 1200 దాటి జనాభా ఉన్న లేక ఎక్కువ నమోదులు ఉన్న రెండొవ పుస్తకమును వాడగలరు. 

ఈ రిజిస్టర్ ANM సంబందించినది మాత్రమే. 

ఈ రిజిస్టర్ 2 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా  ఇవ్వడం జరిగింది.

విలేజ్ / కవరేజి ఏరియా ప్రొఫైల్ ఎంట్రీ 

01.04.2022 నుంచి ఆ గ్రామ వివరాలతో ప్రొఫైల్ పూర్తి చేయవలెను. 

MPW అనగా మగ ఆరోగ్య కార్యకర్త పేరు రాయవలెను.

సమ్మరీ షీట్

ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల నమోదు చేయబడిన లబ్ధిదారుల సంఖ్య ను సమ్మరీ షీట్ నందు నమోదు చేయవలెను. 

అర్హులైన దంపతులు / గర్భిణీ స్త్రీల సూచిక

  1. ముందుగా ఫిబ్రవరి నుంచి గర్భవతులు నమోదు చేసి ఉంటె వాటి తరువాత 01.04.2022 నాటికి కాన్పు కాకుండా ఉన్న వారి వివరాలను EC నుంచి అప్పటివరకు అందుకున్న వివరాలన్నీ నమోదు చేయవలెను. (కానీ వారి సంఖ్యను సమ్మరీ నందు చూపరాదు.)

  2. క్షేత్ర స్థాయిలో ముందుగా గర్భవతి అవడానికి అవకాశం ఉన్న ప్రతి దంపతులను సర్వే చేసి నమోదు చేయవలెను.

  • నూతన దంపతులు 

  • పిల్లలు లేని వారు (40 సం లోపు దంపతులు)

  • ఒక్క పిల్లవాడు ఉన్న వారు 

  • ఇద్దరు పిల్లలు ఉన్న వారు

  • ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉన్న వారు (40 సం లోపు దంపతులు)

    (వీటికి  సంబందించిన సంఖ్యను కూడా సమ్మరీ నందు చూపరాదు.)

    పైన తెలిపిన వివరములను తప్పనిసరిగా ముందుగా అర్హులైన దంపతుల సూచిక నందు సంక్షిప్త సమాచారం వ్రాయవలెను. పూర్తి సమాచారం ఏ పేజీ నందు వ్రాసారో ఆ పేజీ నంబరు తప్పనిసరిగా తెలుపవలెను.

    పైన వివరములు అన్ని రాసిన తరువాత ప్రతి నెల  వివాహము అయ్యే దంపతులు లేదా మీ గ్రామానికి కొత్తగా వచ్చిన వారి వివరములను నమోదు చేయవలెను. 

    వారి అంకెను మాత్రమే నెలవారీ సమ్మరి నందు నమోదు చేయవలెను.

    అర్హులైన దంపతులు / గర్భిణీ స్త్రీల రిజిస్ట్రేషన్ ఫారం 


    ప్రతి అర్హులైన దంపతుల పూర్తి వివరములను రిజిస్ట్రేషన్ ఫారం నందు నమోదు చేయవలెను.   

    అందచేస్తున్న తాత్కాలిక కుటుంబ నియంత్రణ సేవల వివరాలు ప్రతి నెల నమోదు చేయవలెను.

    గర్భవతి అయినచో ఆ సేవలను కొనసాగించాలి. గర్భవతిగా అందించా వలసిన సేవలను నిర్దేశిత షెడ్యూలు ప్రకారం అన్ని సేవలను అందిస్తూ ప్రతి నెల నమోదు చేయవలెను.

    కాన్పు వివరములు బిడ్డ వివరములు వారితో పాటు పుట్టినప్పటి వాక్సిన్ వివరములు వరకు 2 పేజిలలోనే ఒకేచోట నమోదు చేయాలి. 

    EC గా నమోదు చేసిన వెంటనే వారికీ RCH పోర్టల్ నందు వచ్చే ID ని తప్పనిసరిగా రాయవలెను. 

    EC యొక్క ప్రస్తుత స్థితి 

    •  మీ గ్రామ దంపతులు (నాన్ ఆపరేటెడ్ ) - యాక్టివ్ 

    • వేరే ప్రదేశములనుంచి వస్తే / వెళ్లిన వారిని  - వలస 

    • అమ్మగారి ఇంటికి వస్తే వారిని - అతిధి 

    • మీ గ్రామ దంపతులు  ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే - ఇన్ యాక్టివ్

    • మీ గ్రామ దంపతుల లో ఎవరైనా చనిపోతే  - క్లోజ్డ్

    ఆడ వారి బ్యాంకు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయవలెను. 

    వారి పూర్వపు పిల్లల వివరాలు కూడా తప్పనిసరిగా రాయవలెను. (RCH పోర్టల్  అప్డేట్ చేయవలెను). 

    ప్రస్తుతం తాత్కాలిక కుటుంబ నియంత్రణ వాడుతుంటే వివరాలు వ్రాయాలి. 

    గర్భవతి అయ్యే వరకు అందచేస్తున్న తాత్కాలిక కుటుంబ నియంత్రణ సేవల వివరాలు ప్రతి నెల నమోదు చేయాలి. 



    గమనిక : పూర్తి సమాచారం కొరకు మరల చూడగలరు

     వీడియో రూపంలో 



     

Comments