వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి చనిపోతే పరిస్థితి ఏమిటి ? ఒక ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి వ్యధ ....

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి చనిపోతే పరిస్థితి ఏమిటి ?

వైద్య ఆరోగ్య శాఖలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఇప్పటికే అనేక మంత్రి ఆరోగ్య కార్యకర్తలు (మగ/ఆడ) మరియు ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నిషన్లు చనిపోవడం జరిగింది. ఈ నెలలోనే దాదాపుగా 5 గురు మరణించడం జరిగింది. వీరి కుటుంబాలకు ఎటువంటి సహాయం అందలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలో పని చేస్తున్నాము అనే కానీ మరణించిన కుటుంబాలకు ఎటువంటి చేయూత కానీ, రక్షణ కానీ, ఉద్యోగ హామీ కానీ లేకుండా పోయింది. 

కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేయడం వలన చాలి చాలని జీతాలతో నెట్టుకు వస్తున్నా కుటుంబాలకు ఉద్యోగి మరణిస్తే వారి పరిస్థితి చాల దయనీయమైన స్థితిలోకి నేట్టివేయడం జరుగుతుంది. వారి కుటుంబాలు ఆర్ధికంగా నిల దొక్కుకోలేక జీవితం దుర్భరంగా గడపవలసి పరిస్థితులు ఉన్నాయి. 

కాంట్రాక్టులో పనిచేస్తున్న ఉద్యోగులే తలా కొంత ధన సహాయం కూడా బెట్టి ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందిస్తున్నారు కానీ వేరే ఎటువంటి సహాయ సహకారాలు అందక ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులో ప్రజలకు సేవలు అందించి కూడా వారి కుటుంబం దయనీయ పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాలు గడపవలిసిరావడం చాల శోచనీయం.

ప్రభుత్వం వారు వీటిని గ్రహించి గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని రెగ్యులర్ చేసి వారిని ఆదుకోవలసిన అవసరం చాల ఉంది. అలాగే ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి ఒకవేళ మరణిస్తే వారి కుటుంబానికి కూడా కారుణ్య నియామకం పరిధిలో తీసుకొని ఆ కుటుంబలో వారికీ కనీసం కాంట్రాక్టు పద్దతిలో అయినా ఉద్యోగం కల్పించి వారి కుటుంబాన్ని రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 

ప్రతి ఒక్కరు కాంట్రాక్టు ఉద్యోగి వ్యధను గుర్తించి తమవంతు ప్రయత్నం తో వారిని ఆదుకునే విధంగా సహకరించి ఉద్యోగ భద్రతతో పాటుగా వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేవిధంగా సహకరిస్తారని ఆశిస్తూ...... 

ఒక ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి వ్యధ .... 

 


కర్నూలు జిల్లాలో ఈ నెల 10వ తేదీన ఉలిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో MPHA (M) గా పనిచేస్తూ మరణించిన ప్రసన్న శాస్త్రి గారి కుటుంబాన్ని పరామర్శించిన AP CO-SEWA టీం. కర్నూలు జిల్లా మిత్రులు 42,500/- ఆర్థిక  సహాయం చేశారు. అలాగే ఫోన్ పే ద్వారా స్టేట్ వైడ్ మిత్రులు అందించిన సహాయం 72,000/- మొత్తం 1,14,500/- అందినాయని ప్రసన్న శాస్త్రి కుటుంబ సభ్యులు తెలిపారు.
 
ప్రసన్న శాస్త్రి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో AP CO-SEWA ప్రెసిడెంట్ లంకా మణికాంత్, సెక్రటరీ లింగాల కరుణాకర రెడ్డి ట్రెజరర్ శీరం రమేష్, స్టేట్ కో ఆర్డినేటర్ దాసరి మురళీధర్, అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ M.సుధాకర్, సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ మస్తాన్, కార్యదర్శి జయరాజా రావు మరియు కర్నూలు జిల్లా మిత్రులు కరుణానిధి, ప్రభాకర్, సుభాష్, నాగన్న, తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 



 

Comments