" స్పర్ష (Sparsh) లెప్రసీ అవగాహన ప్రచార కార్యక్రమం" | "కుష్టు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్దాం.. కుష్టు వ్యాధి లేని సమాజాన్ని నిర్మిద్దాం" | నిర్వహణ ప్రణాళిక | కలెక్టరు గారి సందేశం

 

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు (From 30.01.2023 to 13.02.2023) 15 రోజులపాటు  లెప్రసి అనగా కుష్టు వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించుట కొరకు " స్పర్ష  (Sparsh) లెప్రసీ అవగాహన  ప్రచార కార్యక్రమం"  నిర్వహించుట జరుగుతుంది.
 
ఈ ప్రచార కార్యక్రమం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జాతీయ కుష్టు నివారణ డిపార్ట్మెంట్ (National Leprosy Eradication Programme) ద్వారా ప్రజలలో కుష్టు వ్యాధి పట్ల అవగాహన కల్పించుట కొరకు మరియు ముఖ్యంగా Leprosy వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ఉండుట కొరకు తీసుకోవలసిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తము ఈ 15 రోజులపాటు జిల్లాలో  ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల ఆధ్వర్యంలో  స్పెర్స్ లెప్రసి అవగాహన కార్యక్రమం-2023 నిర్వహించుట జరుగుతుంది. 
 
తేదీ 30.01.2023 న  సోమవారం నాడు  జిల్లా పరిపాలనాధికారి కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాం గురించి అధికారికంగా ఈ స్పెర్స్ కార్యక్రమం గురించి ప్రజలకు సందేశము ఇస్తారని తెలియజేసినారు. 
 
కావున జిల్లా ప్రజలందరూ ఈ లెప్రసీ అవగాహన ప్రచార కార్యక్రమంలో  భాగస్వాములై. కుష్టు రహిత సమాజం కొరకు "చేయి చేయి కలుపుదాం - కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల  ప్రేమాభిమానాలు చూపిస్తూ వారిని గౌరవిద్దాం.." లెప్రసితో పోరాడుదాం మరియు "కుష్టు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్దాం.. కుష్టు వ్యాధి లేని సమాజాన్ని  నిర్మిద్దాం" - అనే నినాదాలతో బాధ్యత గల పౌరులు అందరూ  ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని  కోరుతున్నాము.
 

కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తింపు ఉద్యమం 
 
కుష్ఠు వ్యాధి యొక్క లేదా అనుమానిత కేసులను గుర్తించడానికి సంకేతాలు మరియు లక్షణాలు 

  1. పాక్షికంగా లేదా పూర్తిగా స్పర్శ  కోల్పోవడంతో పాటు చర్మం రంగులో ఏదయినా మార్పు (చర్మం పైన లేత గోధుమ రంగు లేదా ఎర్రటి మచ్చ).
  2. మచ్చ పైన చర్మం మందంగా మారటం. 
  3. మెరుస్తూ లేదా జిడ్డు కారుతూ ఉండే ముఖ చర్మం. 
  4. చర్మ పై నాడ్యూల్స్ (కురుపులు).
  5.  చెవి తమ్మే (లు) మందంగా మారడం / చెవి పై కురుపులు / మొఖం పై కురుపులు 
  6. కళ్ళు మూయలేక పోవడం, కంటి నుండి నీరు కారడం 
  7. కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవడం 
  8. ముక్కు లోపలి పోవడం (గుర్రపు జీను ముక్కు)
  9. ఉపరితల నరాలు మందం కావడం. 
  10. మోచేయి, మోకాలు చీలమండ సమీపంలో నొప్పి లేదా జలదరింపు 
  11. చల్లని, వేడి వస్తువులు గుర్తించలేకపోవడం 
  12. చేతిలో లేదా పాదం లో తిమ్మిర్లు 
  13. అరచేతి లో స్పర్శ కోల్పోవడం 
  14. గాయం అయినా నొప్పి లేకపోవడం 
  15. పాదాల బలహీనత వలన నడుస్తున్నపుడు పాదరక్షలు జారిపోవడం. 
  16. వస్తువులు పట్టుకోలేకపోవడం. 
  17. గ్రహణశక్తి కోల్పోవడం. 
  18. చొక్కా గుండీలు కూడా పెట్టుకోలేకపోవడం  
స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహణ ప్రణాళిక 

స్పర్శ కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13, 2023 వరకు జరుగుతుంది.

1. జనవరి 30 గాంధీ వర్ధంతి ని పరష్కరించుకొని అన్ని గ్రామ పంచాతిలలో / గ్రామ వార్డ్ సచివాలయంలలో కుష్ఠువ్యాధి పై గ్రామ సభలు
నిర్వహించాలి.

2. గ్రామ సభలు నిర్వహించే వారు MLHP / ANM, ASHA, AWW, మరియు టీచర్లు.

3. గ్రామ సభలకు ఎక్కువ మంది ప్రజ
లు పాల్గొనేటట్లు చూడాలి.

4. గ్రామ సభలలో ప్రజలకు కలెక్టర్ గారి సందేశం
టీచర్ చదవి వినపించాలి. 

5. గ్రామ సభలో సర్పంచ్ గారి సందేశం
MLHP చదివి వినపించాలి.

6. కుష్ఠు వ్యాధి పై అవగాహన, MDT ఉచిత చికిత్స గురించి కరపత్రం ను
ANM చదివి వినపించాలి.

7. గ్రామ సభ
నిర్వహించే సందర్బంలో మినిట్స్ బుక్ లో సంతకాలు తీసుకొనవలెను.

8. గ్రామ సభలు నిర్వహించే సందర్బంలో ఫొటోస్ తీసుకొని ఆరోగ్య కేంద్రానికి పంపాలి.

9.
ఆరోగ్య కేంద్రాలలో NLEP నోడల్ అధికారి అన్ని గ్రామ పంచాయతిలలో కార్యక్రమ నిర్వహణ ఫొటోస్ తీసుకొని ADM&HO(L, A&TB) ఆఫీసుకు మెయిల్ ద్వారా పంపాలి.

10. ఏవైనా గ్రామ పంచాతీలు మిగిలి ఉంటే 31.01.2023 న గ్రామ సభలు నిర్వహించాలి.

11.
కరపత్రం, కలెక్టరు గారి సందేశం, మరియు సర్పంచ్ గారి సందేశం సిద్ధం  చేసుకోవాలి.

12. ప్రకారం ప్రతి ANM కార్యక్రం నిర్వహణ ప్రణాళికను  తయారు చేసి జిల్లా ఆఫీస్ మెయిల్ కు పంపాలి.

13. ప్రతి మెడికల్ ఆఫీసర్ ఎక్కడో ఒక చోట గ్రామ సభలకు హాజరు కావలెను.
 


 

Comments