కాంట్రాక్టు ఉద్యోగుల విషయం సియం దృష్టిలో ఉంది-రెగ్యులర్ అవుతుంది: ప్రధాన కార్యదర్శి కె.యస్.జవహర్ రెడ్డి
కాంట్రాక్టు ఉద్యోగుల విషయం సియం దృష్టిలో ఉంది-రెగ్యులర్ అవుతుంది:
ప్రధాన కార్యదర్శి - కె.యస్. జవహర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి దృష్టిలో ఉందని,రెగ్యులర్ అవుతారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.యస్.జవహర్ రెడ్డి ఏపి డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం మధ్యాహ్నం వైయస్సార్ జిల్లా పులివెందుల శాసనసభ నియోజకవర్గం సింహాద్రిపురం మండలం చవ్వావారిపల్లె పర్యటనకు వచ్చిన సందర్భంగా జెఏసి రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి, వైయస్సార్ జిల్లా కన్వీనర్ బుక్కె గోపాల్ నాయక్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా చీప్ సెక్రటరీ గారితో యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు విధానంలో మగ్గుతున్నమని, ఇటివలే చాలా మంది కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది రెగ్యులర్ కాకుండానే మనోవేదన, అనారోగ్యానికి గురికావడంతో వరుస మరణాలు సంభవించాయని, ఉద్యోగ విరమణ వయస్సు దాటిపోవడంతో రెగ్యులర్ పొందకుండా, ఒక్కరూపాయి కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందకుండా రిటైర్మెంట్ కావడం జరుగిందని ఆయనకు తెలిపారు.
సుప్రీం కోర్టు కేసు తీర్పు ప్రకారం పేపర్ నోటిఫికేషన్, వ్రాత పరీక్ష ద్వారా, ఆర్డర్ ఆఫ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, క్లియర్ వ్యాకెన్సీల్లో, సాంక్షన్ద్ పోస్ట్ లందు నియామకం ఉత్తర్వులు పోంది అన్ని అర్హతలు ఉన్న వారందరిని రెగ్యులర్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేని విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ప్రత్యేక చోరవతో తీసుకెళ్లాలని దీనంగా వారు అర్థించారు.దానికి ప్రతిస్పందనగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని, రెగ్యులర్ అవుతారని చేప్పారు.
Comments
Post a Comment