వైద్య ఆరోగ్య శాఖలో మరో కాంట్రాక్టు ఉద్యోగి మృతి | ముద్దలయ్య | ఆర్థిక సాయం చేయదలిస్తే

 

వైద్య ఆరోగ్య శాఖలో మరో కాంట్రాక్టు ఉద్యోగి మృతి

వైద్య ఆరోగ్య శాఖలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఇప్పటికే అనేక మంది ఆరోగ్య కార్యకర్తలు (మగ/ఆడ) మరియు ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నిషన్లు చనిపోవడం జరిగింది. ఈ నెలలోనే దాదాపుగా 6 గురు మరణించడం జరిగింది. వీరి కుటుంబాలకు ఎటువంటి సహాయం అందలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలో పని చేస్తున్నాము అనే కానీ మరణించిన కుటుంబాలకు ఎటువంటి చేయూత కానీ, రక్షణ కానీ, ఉద్యోగ హామీ కానీ లేకుండా పోయింది. 

కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేయడం వలన చాలి చాలని జీతాలతో నెట్టుకు వస్తున్నా కుటుంబాలకు ఉద్యోగి మరణిస్తే వారి పరిస్థితి చాల దయనీయమైన స్థితిలోకి నేట్టివేయడం జరుగుతుంది. వారి కుటుంబాలు ఆర్ధికంగా నిల దొక్కుకోలేక జీవితం దుర్భరంగా గడపవలసి పరిస్థితులు ఉన్నాయి. 

కాంట్రాక్టులో పనిచేస్తున్న ఉద్యోగులే తలా కొంత ధన సహాయం కూడా బెట్టి సహాయం అందిస్తున్నారు కానీ వేరే ఎటువంటి సహాయ సహకారాలు అందక ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులో ప్రజలకు సేవలు అందించి కూడా వారి కుటుంబం దయనీయ పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాలు గడపవలిసి రావడం చాల శోచనీయం. 




మిత్రులకు మనవి🙏
---------------------------

నిన్న  మరణించిన   అనంతపురం జిల్లా కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ సోదరుడు ముద్దలయ్యది పేద కుటుంబం. భార్య, ఎనిమిదో తరగతి చదివే అమ్మాయి, ఐదవ తరగతి చదివే అబ్బాయి ఉన్నారు. పెద్దలు,  మిత్రులు ఎవరైనా ఆర్థిక సాయం చేయదలిస్తే ఈ క్రింద కనపరచిన ముద్దలయ్య భార్య బ్యాంకు అకౌంట్ కు పంపవలసినదిగా మనవి.


SBI AC no - 31373238202
ISFC code - SBIN0000923
SBI తాడిపత్రి బ్రాంచ్
Name : రాధిక 


ప్రతి ఒక్కరు కాంట్రాక్టు ఉద్యోగి వ్యధను గుర్తించి తమవంతు ప్రయత్నం తో వారిని ఆదుకునే విధంగా సహకరించి ఉద్యోగ భద్రతతో పాటుగా వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేవిధంగా సహకరిస్తారని ఆశిస్తూ...... 

ఒక ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి వ్యధ ....

Comments