గ్రామ / వార్డ్ సచివాలయ ట్రాన్స్ఫర్స్ గురించి నిర్వహించిన VC లోని ముఖ్యాంశాలు


GSWS డైరెక్టర్ గారు జిల్లా HOD లతో గ్రామ / వార్డ్  సచివాలయ ట్రాన్స్ఫర్స్ గురించి నిర్వహించిన VC లోని ముఖ్యాంశాలు


  1. ముందుగా Yes అని ఉన్న పోస్టులన్నీ ఫిల్ చేయాలి, అవి ఫిల్ చేయగా మిగిలిన వారు ఎవరైనా ఉంటే వారిని NO ఉన్న పోస్టుల్లో ఫిల్ చేయాలి. (ANM Gr  - III అన్ని Yes ఉంటాయి). 
  2. Yes అని ఉన్న పోస్టులు పూర్తిగా ఫీల్ అవ్వకపోతే, ఐదు సంవత్సరాలు దాటక పోయినప్పటికీ వారిని నో అని ఉన్న  సచివాలయం నుండి ఎస్ అని ఉన్న సచివాలయం కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
  3. నేటివ్ మండలం అనేది SR లో ఉన్న రెసిడెన్షియల్ అడ్రస్ ప్రకారం మాత్రమే కన్సిడర్ చేయాలి, స్టడీ సర్టిఫికేట్ అనేది కేవలం లోకల్ జిల్లా నిర్ణయించడానికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.
  4. కేవలం ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి మాత్రమే నేటివి మండలం నిబంధన వర్తిస్తుంది, గత సంవత్సరం ట్రాన్స్ఫర్ అయ్యి సొంత మండలంలో పనిచేస్తున్న వారికి ఈ నిబంధన వర్తించదని తెలియజేశారు.  ఒకవేళ అలాంటి వారికి ట్రాన్స్ఫర్ కావాలంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోవాలి. 
  5. HOD లకు ఇచ్చిన డేటా షీట్స్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే దానిలో ఏమైనా పొరపాట్లు ఉంటే జిల్లా ఉన్నతాధికారులు ఆమోదంతో మ్యానువల్ గా కరెక్ట్ చేసుకోవచ్చు.
  6. ఐదు సంవత్సరాలు పూర్తయిన వారికి ప్రత్యేక కేటగిరీలు వికలాంగులు , మెడికల్ గ్రౌండ్స్, స్పోజ్ మొదలైన వారికి కౌన్సిలింగ్  సమయంలో ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అని తెలియజేశారు. వీరికి ప్రత్యేకంగా ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ ఉండదని చెప్పారు.
  7. బదిలీల ప్రక్రియ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ తో సహా ఈనెల 30 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలి.
  8. బదిలీలు అయిన ఉద్యోగులు ను పెన్షన్  పంపిణీ తర్వాత మాత్రమే రిలీవ్ చేయాలని తెలియజేశారు.

Note : ఈ వివరములు కేవలం సమాచారం నిమిత్తం మాత్రమే మార్పులకు ఈ బ్లాగ్ వారికీ సంబంధం లేదు వివరములు మీ HOD దగ్గర తెలుసుకోగలరు.  

Comments