రవితేజ ఖిలాడి రివ్వు సినిమా ఎలావుందంటే Khiladi review


 

రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా ఈరోజు అంటే ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.

క్రాక్ తరవాత. ఫుల్ స్వింగ్‌లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు ఫుల్లుగా సినిమాలు చేసేస్తున్నాడు. అందులో ఖిలాడి ఒకటి. ‘ఖిలాడి’ మూవీ టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలఅయ్యింది.  అంతేకాదు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేసారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా తెరపైకొచ్చింది. మరి ఈ ఖిలాడి ఆడిన ఖిల్ ఖిల్ ఖిలాడీ ఆటేమిటి?

పది వేల కోట్ల డబ్బున్న ట్రక్‌. మిస్సవుతుంది. ఆ ట్రక్ కోసం రెండు ముఠాలు అన్వేషిస్తుంటాయి. కుటుంబాన్నంతటినీ హత్య చేసిన కేసులో. మోహన్ గాంధీ (రవితేజ) అరెస్ట్ అవుతాడు. అతని కేసు ఇంట్రస్టింగ్ గా అనిపించి, సైకాలజీ స్టూడెంట్ పూజా (మీనాక్షి చౌదరి) మోహన్ గాంధీని కలుసుకోవాలని జైలుకి వెళ్తుంది. తన కథ విని కరిగిపోతుంది. తన తండ్రి పలుకుబడిని ఉపయోగించి. మోహన్ గాంధీని బయటకు తీసుకురావాలనుకుంటుంది. ఆ ప్రయత్నంలో ఏం జరిగింది? పదివేల కోట్ల డబ్బు ఏమైంది? ఆ డబ్బు, మోహన్ గాంధీకీ ఉన్న లింకేమిటి? అసలు ఈ హత్యలన్నీ మోహన్ గాంధీ ఎందుకు చేశాడు? అనేదే ఖిలాడి కథ.  


ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. రన్ టైమ్ 154 నిమిషాలు ( 2గంటల 34 నిమిషాలు) ఉంది. చాలా రెగ్యులర్ కమర్షియల్ లైన్‌కే.. బోలెడన్ని ట్విస్టులు జోడించి.. కొత్త కలరింగ్ ఇద్దామని చిత్రబృందం రెండున్నర గంటల పాటు ప్రయత్నించింది. ఇంట్రవెల్ కి ముందు అసలు సిసలైన ట్విస్టు. ఆ తరవాత ట్విస్టుల మీద ట్విస్టులు. ఇన్ని రకాల ట్విస్టులుంటే స్క్రీన్ ప్లే అదిరిపోవాలి  కదా? థ్రిల్లర్ ట్విస్టులతో ప్రేక్షకుడు సీట్ ఎడ్జ్  థ్రిల్ ఫీల్ కావాలి కదా? కానీ ఖిలాడీ అలా ఉండదు. సన్నివేశాలు కేవలం ట్విస్టుల కోసమే  రాసుకుని, ఆ ట్విస్టులో ఇంట్రెస్ట్ ఉన్న ఆ సీన్‌ సరిగా లేక ప్రతీ సన్నివేశం చప్పగా సాగుతుంటుంది. ట్విస్టులు ఎక్కువై కథంతా గందరగోళంలా తయారవుతుంది. చివరికి ఆడియన్స్ కన్వీన్స్ చేయడానికి కన్‌ఫ్యూజన్‌కి గురి చేసి కధంతా కెలికి వదిలేశాడు దర్శకుడు. 

మోహన్ గాంధీ ఫ్లాష్ బ్యాక్‌లో (మర్డర్ ఎపిసోడ్‌ని మినహాయిస్తే) అంతా పసలేని కధే. రవితేజ తన ఎనర్జీని చూపించడానికి తెగ తాపత్రయపడ్డ. సన్నివేశం మాత్రం పేలలేదు. దానికి కారణం.. స్క్రీన్ రైటింగ్‌ పేలవమైన ఉండటమే.  హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బోరింగ్ గా సినిమాకు మరింత బోర్ చేసేసింది. వెన్నెల కిషోర్ ఉన్నా ఉపయోగేమ్ లేకుండా లేకపోవడంతో.. ఫస్టాఫ్ అంత ఆలా ఆలా సాగిపోయింది. మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ రెండు బీటున్న పాటలు ఇవ్వడంతో కాస్తో కూస్తో రిలాక్సేషన్ దక్కింది. ఇంట్రవెల్ ట్విస్టు వరకూ.. చాలా ఓపిగ్గా ఈ సినిమాని భరించాల్సిందే. 

 
ఇంట్రవెల్ తరవాత.. ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమా ఊపందుకోక మరింత నీరసిస్తుంది. లేని పోని ట్విస్టులు జోడించుకుంటూ కథని కలగాపులగం చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక్కడ సినిమా అయిపోయిందే.` అనుకున్నప్పుడు ఓ ట్విస్టు. ఆ తరవాత ఇంకాసేపటికి మరో ట్విస్టు. ఇలా ఈ కథని ఎంత కంగాళీ చేయాలో.. అంతా చేసేశారు. ప్రతీ పాత్రలోనూ రెండు షేడ్స్ చూపడానికి దర్శకుడు ప్రయత్నిచాడు. అందుకే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టరు రెండురకాలుగా  బిహేవ్ చేస్తుంది. `డ్రామా` సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఆ డ్రామా చూసీ.. చూసీ ఏది డ్రామానో, ఏది రియలో.. అర్థం కాకుండా పోయింది. `అసలు గాంధీ ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడో తెలుసా` అంటూ.. గాంధీ ఛారిటీల గురించి అనసూయ చెప్పబోతోంటే. థియేటర్ అంతా.. గోల గోల.  యాక్షన్లు, ఛేజులు, ట్విస్టులు ఇవన్నీ కావల్సినంత ఉన్నా.. అవేం రంజింపచేయలేదు. దర్శకుడే.. శుభం కార్డు ఎక్కడ వేయాలో, ఎప్పుడు వేయాలో తెలీక తికమక పడటం  అర్థం అయిపోతుంది.

రవితేజ ఎనర్జీ ఏదోటి చేసేయాలన్న తపన.. ఇక్కడా కనిపించింది. తానొక్కడే చాలా సినిమాల్ని నెట్టుకొచ్చాడు. కానీ ఈసారి తన వల్ల కూడా కాలేదు. రవితేజ క్లోజప్ పెడితే.. ముసలితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అది ఆయన తప్పు కాదు. వయసు ప్రభావం. డింపుల్ హయతి.. పక్కా ఐటెమ్ గర్ల్ లాగా, వ్యాంపులా అందాలు చూపించింది తప్ప, హీరోయిన్ లా లేదు. మేకప్ మరీ ఓవర్ అయ్యింది. మీనాక్షి చౌదరి పర్లేదు అనిపించింది. డాన్సులు మాత్రం ఇద్దరూ ఇరగదీశారు. అర్జున్ పాత్ర బాగానే ఉంది కానీ, మరింత పవర్ ఫుల్ మలిచి ఉండాల్సింది. రవితేజతో పోలిస్తే.. అర్జునే యంగ్ గా కనిపించాడు. వెన్నెల కిషోర్ ని సరిగా వాడుకోలేదు. మురళీ శర్మ, రావు రమేష్ అలవాటైన పాత్రల్లో అల్లుకుపోయారు వాళ్ళ పాత్రలే సినిమాకి కొంచం న్యాయం చేసాయి అనిపిస్తాయి .

దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎప్పటిలాగే ప్రేక్షకులకి ఊపు తెచ్చాయి. డాన్స్ కంపోజీషన్‌, డ్రస్సింగ్ స్టైల్స్ బాగున్నాయి. సినిమా వాయిదాలు పది సమయం చాల దొరికిన కూడా పోస్ట్ ప్రొడక్షన్‌కి కావల్సినంత సమయం సరిగా పట్టించుకోకుండా వదిలేశారెమో, కొన్ని చోట్ల క్వాలిటీ షాట్లు ఉన్న కూడా అలా చూసీ చూడనట్టు వదిలేశారు. శ్రీకాంత్ విస్సా డైలాగుల్లో మెరుపులేం లేవు. ఓ సాదా కథకు, ట్విస్టులు జోడిస్తే.. ఇంట్రస్టింగ్ గా మారుతుంది. కానీ ట్విస్టులు ఎక్కువైతే.. గందరగోళం తో ముగుస్తుంది. ఖిలాడీ విషయంలో అదే జరిగింది.

ముగింపు : ఒకసారి చూడవచ్చు



Comments