గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్
ఏప్రిల్‌లో పరీక్షలు.
ప్రాథమిక సమాచారం మేరకు.. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి చేసిన విషయం తెల్సిందే.
2023 ఏప్రిల్లోపే మూడో విడత నోటిఫికేషన్‌కు సంబంధించిన రాతపరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు.
ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే రాతపరీక్షలతో సహా మొత్తం భర్తీ ప్రక్రియను చేపడతారు. ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇటీవలే పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది.
అలాగే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొంది. మొత్తం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక సమాచారం మేరకు కేటగిరీల వారీగా
ఉద్యోగ ఖాళీల వివరాలు
కేటగిరీ ఖాళీలు
గ్రేడ్ -5 పంచాయతీ కార్యదర్శులు 182
డిజిటల్ అసిస్టెంట్ 736
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 578
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 467
హారి్టకల్చర్ అసిస్టెంట్ 1,005
సెరికల్చర్ అసిస్టెంట్ 23
పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ 4,765
ఫిషరీస్ అసిస్టెంట్ 60
ఇంజనీరింగ్ అసిస్టెంట్ 982
వీఆర్వో గ్రేడ్-2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ 112
విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990
వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీ 170
వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 197
వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 153
వార్డు శానిటేషన్ అండ్ ఎని్వరాన్‌మెంట్ సెక్రటరీ 371
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 436
వార్డు ఎమినిటీస్ సెక్రటరీ 459
ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ 618
మహిళా పోలీసు లేదా వార్డు ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ 1,092
ఎనర్జీ అసిస్టెంట్ 1,127
మొత్తం 14,523
Job
ReplyDelete