స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు (SGSW) సిబ్బందిని ఇతర విధులకు కేటాయించే ముందు SGSW శాఖ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి | ప్రభుత్వ ఉత్తర్వుల 3471684/GSWS01/2026, తేదీ: 23.10.2026

సచివాలయ సిబ్బందికి వారి నిర్దేశిత పని కాకుండా ఇతర పనులకి (BLO / Survey) ఉపయోగించాలి అంటే అనుమతి తప్పనిసరి 

ముఖ్యమైన సూచనలు – ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు


ప్రభుత్వ కార్యదర్శి, స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ భాస్కర్ కటమనేని (Sri Bhaskar Katamneni) గారు జారీ చేసిన 

మెమో నెం. 3471684/GSWS01/2026, తేదీ: 23.10.2026 ప్రకారం, 

స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు (SGSW) సిబ్బందిని దీర్ఘకాలికంగా మరియు ఎక్కువ సమయం పట్టే ఇతర విధులకు, ముఖ్యంగా BLO, Census మరియు ఇతర సమానమైన విధులకు కేటాయించే ముందు SGSW శాఖ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది.


ఈ నేపథ్యంలో జిల్లాలోని సంబంధిత అధికారులందరికీ తెలియజేయునది ఏమనగా:


SGSW సిబ్బందిని దీర్ఘకాలిక మరియు ఎక్కువ సమయం పట్టే ఇతర విధులకు SGSW శాఖ ముందస్తు అనుమతి లేకుండా కేటాయించరాదు.


సిబ్బంది ప్రధాన విధులైన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పౌర సేవల పంపిణీ మరియు ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలి.


గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలు నిరంతరాయంగా కొనసాగాలి.


పై ప్రభుత్వ ఆదేశాలను సంబంధిత అధికారులు మరియు సిబ్బంది తప్పనిసరిగా పాటించాలి.


కావున, సంబంధిత MPDOలు, మున్సిపల్ కమిషనర్లు, MSOs మరియు USWOs ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడమైనది.






Comments